ఎరుపురంగులో మిళమిళ మెరుస్తూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన Toyota బ్రాండ్ న్యూ
దేశీయ మార్కెట్ లో ఎలక్ట్రిక్ వాహన సందడి పెరుగుతోంది. తాజాగా టోయోటా కూడా ఈ రంగంలో అడుగు పెట్టింది. మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు 'అర్బన్ క్రూయిజర్ ఈబెల్లా (Urban Cruiser Ebella)'ను ఆవిష్కరించింది. గత ఏడాది జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో సందర్భంగా మారుతి ఈ-విటారా (Maruti e-Vitara)కు ఇది రీబ్రాండెడ్ వెర్షన్ కావడంతో.. రెండు వాహనాల రూపురేఖలు, డిజైన్‌లో చాలా దగ్గరి పోలికలు కనిపిస్తోన్నాయి. ఇది- దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్‌లో కొత్త పోటీని సృష్టించింది.
ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ బుకింగ్‌లు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. కొనుగోలుదారులు టయోటా అధికారిక వెబ్‌సైట్ లేదా అధీకృత డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఈ కారు ధర రూ. 19.06 నుండి 24.42 లక్షల రూపాయలు. 25,000 రూపాయలను టోకెన్ అమౌంట్ గా చెల్లించి, కారును బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. టోయోటా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని రెండు వేర్వేరు బ్యాటరీ ప్యాక్‌లతో అందిస్తోంది. ఒకటి- 49 కిలోవాట్, మరొకటి 61 కిలోవాట్.

కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం- ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 543 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను ఇస్తుంది. దీని ఎలక్ట్రిక్ మోటార్ 128 కిలోవాట్ ఎనర్జీ, 189 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండటం దీని ప్రత్యేకత. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సిస్టమ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ హీటింగ్, కూలింగ్ సిస్టమ్‌ను కూడా ఇందులో పొందుపరిచారు. సమ్మర్, వింటర్ కాలాల్లో వాతావరణానికి అనుగుణంగా పనిచేస్తుంది. బ్యాటరీ పనితీరును మెరుగుపరుస్తుంది.
ప్యూర్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో తయారైందీ అర్బన్ క్రూజర్ ఈబెల్లా ఈవీ. ముందు భాగంలో థిన్ అండ్ సెగ్మెంటెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, ట్రయాంగిల్ హెడ్ లైట్స్, మధ్యలో ఓ బ్లాక్ కలర్ బాండ్.. ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తోన్నాయి. ఫ్రంట్ బంపర్ కాస్త నునుపుగా ఉండేలా డిజైన్ చేశారు. ఇరువైపులా నిలువుగా ఉండే ఎయిర్ వెంట్స్,. చుట్టూ మందపాటి బాడీ క్లాడింగ్ ఈ ఈవీ ఎస్‌యూవీకి రఫ్ అండ్ టఫ్ లుక్‌ను ఇస్తోన్నాయి. ఇంటీరియర్ లో సీ-పిల్లర్‌లలో హైడింగ్ డోర్ హ్యాండిల్స్, సెగ్మెంటెడ్ టెయిల్ ల్యాంప్స్ అందుబాటులో ఉన్నాయి.
టోయోటా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ మొత్తం తొమ్మిది రంగుల్లో విడుదల అయింది. ఇందులో కేఫ్ వైట్, బ్లూయిష్ బ్లాక్, గేమింగ్ గ్రే, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్ వంటి అయిదు మోనోటోన్ కలర్స్ ఉన్నాయి. వీటితో పాటు, కేఫ్ వైట్, ల్యాండ్ బ్రీజ్ గ్రీన్, స్పోర్టిన్ రెడ్, ఎంటైసింగ్ సిల్వర్‌లతో కూడిన బ్లాక్ రూఫ్, 4- డ్యూయల్ టోన్ రంగుల్లో కూడా ఈ కారు లభిస్తుంది.
10.1 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10.25 ఇంచ్ ల టచ్ స్క్రీన్ అమర్చారు. వైర్‌లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 12- కలర్ యాంబియంట్ లైటింగ్, శక్తివంతమైన జేబీఎల్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు క్యాబిన్‌లో ఉన్నాయి. టోయోటా ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో వందకు పైగా ఐ-కనెక్టెడ్ ఫీచర్లను అందించింది. భద్రత విషయంలో రాజీపడలేదు. అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా 7 ఎయిర్‌బ్యాగ్‌లు, డిస్క్ వీల్స్ బ్రేక్ ఉన్నాయి. టాప్ వేరియంట్‌లో లెవెల్-2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఉంది.
లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, ఏవీఏఎస్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, బ్లైండ్ స్పాట్ మానిటర్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ప్రమాదాల అవకాశాన్ని తగ్గించడంలో సహాయపడతాయని టయోటా తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో టోయోటా ఎనిమిది సంవత్సరాల బ్యాటరీ వారంటీని అందిస్తోంది. దేశవ్యాప్తంగా 500కు పైగా ఈవీ సర్వీస్ టచ్‌పాయింట్‌లను కంపెనీ ఏర్పాటు చేసింది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications