Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

US strike : బంగారం, వెండి, చమురు.. అమెరికా దాడి తర్వాత దేనికి డిమాండ్?

ప్రపంచ మార్కెట్లు మరోసారి ఉలిక్కిపడుతున్నాయి.కొత్త ఏడాది మొదలైన వేళే అంతర్జాతీయ రాజకీయంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామం గ్లోబల్ మార్కెట్లను ఆందోళనకు గురి చేస్తోంది. అమెరికా వెనిజులాపై ఆకస్మికంగా సైనిక చర్య చేపట్టి, ఆ దేశ అధ్యక్షుడు... నికోలస్ మదురోను అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భయం నెలకొంది. ఈ పరిణామాల ప్రభావం బంగారం, వెండి, చమురు ధరలపై ఎంత మేర ఉంటుంది? చమురు నిల్వల దేశంలో కలకలం.. అమెరికా చర్యతో మార్కెట్లు షాక్ కాబోతున్నాయా? ఏం జరగబోతుంది.

వెనిజులా చమురు, బంగారం రంగాల్లో కీలకమైన దేశం కావడంతో అక్కడ రాజకీయ అస్థిరత తలెత్తిన ప్రతిసారి ప్రపంచ మార్కెట్లపై ప్రభావం తప్పదు. ఈ నేపథ్యంలో చమురు, బంగారం, వెండి ధరలు మాత్రమే కాకుండా స్టాక్ మార్కెట్లలోనూ తీవ్రమైన ఊగిసలాటలు చోటుచేసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా వెనిజులాపై ఆకస్మికంగా సైనిక చర్య చేపట్టి, ఆ దేశ అధ్యక్షుడు... నికోలస్ మదురోను, అతడి భార్యను సైన్యం అదుపులోకి తీసుకన్న క్రమంలో స్టాక్ మార్కెట్లలో భయం మొదలైంది.

చమురు ధరలు

ఈ పరిణామాలకు మొదట స్పందించేది చమురు మార్కెట్‌నే. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు వెనిజులాకు ఉన్నప్పటికీ, ఆంక్షలు, మౌలిక వసతుల లోపం కారణంగా ఉత్పత్తి గత కొన్నేళ్లుగా బలహీనంగానే ఉంది. అయితే ఇప్పుడు అమెరికా జోక్యం పెరగడంతో సరఫరా అంతరాయం ఏర్పడుతుందన్న భయాలు మార్కెట్‌లోకి వచ్చాయి. గత ఏడాది చివర్లో భారీగా పడిపోయిన చమురు ధరలు, మళ్లీ వెంటనే పెరగుదల నమోదు చేశాయి. తాజా పరిణామాలతో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా. దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలపై, భారత్‌లో పెట్రోల్-డీజిల్ ధరలపైనా పడే అవకాశముంది.

US strike on Venezuela shakes Oil Gold Silver and Markets

బంగారం - వెండి

ప్రపంచంలో ఉద్రిక్తతలు పెరిగినప్పుడు పెట్టుబడిదారులు సాధారణంగా బంగారం వైపు మొగ్గు చూపుతారు. అమెరికా చర్యల తర్వాత అనిశ్చితి పెరగడంతో, మళ్లీ బంగారంపై ఆసక్తి పెరుగుతోంది. 2025లో బంగారం మంచి లాభాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వెనిజులాలో ఉన్న భారీ బంగారం నిల్వలపై అనిశ్చితి నెలకొనడం వల్ల ధరలు మరింత ఎగబాకే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో వెండి ధరల్లోనూ ఒక్కసారిగా పెద్ద మార్పులు చోటుచేసుకోవచ్చు. బంగారంతో పోలిస్తే వెండి ఎక్కువ ఊగిసలాటకు లోనవుతుందన్నది తెలిసిందే.

అమెరికన్ డాలర్

ఈ పరిణామాల మధ్య అమెరికన్ డాలర్ కదలికలపై కూడా దృష్టి నెలకొంది. గత ఏడాది పొడవునా డాలర్ బలహీనంగా ఉన్నప్పటికీ, వెనిజులా సంక్షోభం నేపథ్యంలో అది ఎలా స్పందిస్తుందో కీలకంగా మారింది. డాలర్ బలపడితే, రూపాయి వంటి కరెన్సీలపై ఒత్తిడి పెరగడంతో పాటు బంగారం, చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.

స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు కూడా ఈ సంక్షోభం ప్రభావాన్ని తప్పక ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. గత మూడు సంవత్సరాలుగా అమెరికా మార్కెట్లు మంచి ప్రదర్శన చూపించినప్పటికీ, ఆకస్మిక భౌగోళిక రాజకీయ సంఘటనలు తాత్కాలికంగా మార్కెట్లను కుదిపేస్తుంటాయి. ఈసారి అమెరికానే ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల, గతంలో జరిగిన కొన్ని అంతర్జాతీయ సంఘర్షణల కంటే ఎక్కువ ప్రభావం ఉండవచ్చని అంచనా. అమెరికా మార్కెట్లలో ఏ చిన్న అస్థిరత వచ్చినా, దాని ప్రభావం భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లపై పడటం ఖాయం.

మొత్తం మీద వెనిజులా సంక్షోభం ప్రపంచ మార్కెట్లపై మరోసారి అనిశ్చితి నీడలు వేసింది. చమురు నుంచి బంగారం వరకు, కరెన్సీల నుంచి స్టాక్ మార్కెట్ల వరకు... వచ్చే రోజుల్లో పెట్టుబడిదారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్త ఏడాది ఆరంభంలోనే ఈ ఉద్రిక్తతలు మార్కెట్లకు ఎలాంటి దిశను చూపిస్తాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+