Silver Price : వెండి పతనం ప్రారంభమైందా? జీవిత కాల గరిష్ఠం నుంచి అమాంతం ఢమాల్
ఒక షార్ట్ ఫిల్మ్ లో హీరో తన ప్రేయసిని "అమ్మా వెండి" అని ముద్దుగా పిలుస్తాడు.. వెండి ఏంటి అందరూ బంగారం అంటారు కదా అని ఆమె అడిగితే..దానికి అతను ఇచ్చే సమాధానం 'బంగారం అనేది అందరూ కొనలేనిది.. కానీ వెండిని మనం కుంకుమ భరణిలా, పట్టీలలా.. ఇంట్లో చిన్న చిన్న వాటికి కూడా వాడుతాం కదా!' అంటాడు. బంగారం విలువ పెరిగినంత మాత్రాన వెండికి డిమాండ్ లేకుండా పోదు కదా అనే డైలాగ్ కూడా వేస్తాడు. ఇప్పుడు బంగారం కంటే వెండి రాజ్యమే నడుస్తుంది. జీవిత కాల గరిష్ఠాన్ని ఈ ఏడాదిలో అందుకుంది కూడా. వెండి పై పెట్టుబడి పెట్టిన వారిని ఏ సందర్భంలో కూడా నిరాశ పరచలేదు. అయితే నిన్న మాత్రం ఒక్కసారిగా ఢమాల్ అనిపించింది.మరి రానున్న రోజుల్లో వెండి ధర తగ్గే అవకాశం ఉందా లేక పెరుగుదల తప్పదా? ఇందుకు కారణాలేంటి? 2026లో ధర ఇంకా పెరుగుతుందా?
జీవిత కాల గరిష్ఠం..
కొన్ని నెలలుగా ఆకాశమే హద్దుగా సిల్వర్ రేట్లులో భారీగా పెరుగుదల కనిపించింది. ఈ డిసెంబరు నెలలో వెండి ధర ఏకంగా 33 శాతం పెరిగింది. తాజాగా సోమవారం రోజు మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజిలో ఇంట్రాడే ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.2,54,174 వద్ద దూసుకుపోయింది. ఇది వెండి చరిత్రలో జీవితకాల గరిష్ఠం. మొత్తం మీద 2025 సంవత్సరంలో సిల్వర్ ధర దాదాపు 181 శాతం పెరిగింది.

అమెరికాకు చెందిన CME గ్రూప్ వెండి ట్రేడింగ్‌పై మార్జిన్ రిక్వైర్మెంట్‌ను 20,000 డాలర్ల నుండి 25,000 డాలర్లకు పెంచింది. ఇది ఇన్వెస్టర్ల మీద ఒత్తిడి పెరిగింది. వెంటనే అమ్మకాలు పెరిగేలా చేసింది. అలాగే ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జియోపాలిటికల్ రిస్క్‌ను తగ్గించాయి. దీంతో సేఫ్ హెవెన్ అసెట్ అయిన వెండిపై పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. ఇక దీంతోపాటు చైనా ఎగుమతులపై లైసెన్సింగ్ నిబంధనలు తీసుకురావడం మార్కెట్‌లో అనిశ్చితిని సృష్టించింది.
అసలు కథ ఇప్పుడే మొదలైందా?
వెండికి సంబంధించి అసలు కథ ఇప్పుడే మొదలైంది అంటున్నారు నిపుణులు. టెక్నికల్ ఇండ్రస్ట్రీస్ లో వెండికి డిమాండ్ పెరుగుతోందనే అందువల్లే 2025లో వెండి ధరల్లో అద్భుతమైన ర్యాలీ జరిగిందని అభిప్రాయపడుతున్నారు.ఈ ఏడాదిలో వెండి రేటు 125 శాతం పెరిగ్గా.. బంగారం రేటు మాత్ర 63 శాతమే పెరుగుదల కనిపించింది. మార్కెట్ నిపుణుల ప్రకారం.. ధరలు అకస్మాత్తుగా పడిపోవడానికి కొన్ని కీలక కారణాలు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం త్వరలోనే ముగుస్తుందని డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు జియోపాలిటికల్ రిస్క్‌ను తగ్గించాయి. దీంతో సేఫ్ హెవెన్ అసెట్ అయిన వెండిపై పెట్టుబడిదారులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గు చూపారు. ఇక దీంతోపాటు చైనా ఎగుమతులపై లైసెన్సింగ్ నిబంధనలు తీసుకురావడం మార్కెట్‌లో అనిశ్చితిని సృష్టించింది.
2026 లో వెండి ధరలు ఎలా ఉంటాయి?
జనవరి 1, 2025 లో కిలో వెండి ధర రూ.85,913 మాత్రమే. ఇప్పుడు 172 శాతం మేర పెరిగి కిలో రూ. 2,33,120 వద్ద సోమవారం నమోదైంది. ఈ నెలనే చూస్తే, డిసెంబరు 1 నుంచి 30 వరకు కిలో ధర రూ.1,75,351. అంటే కేవలం 28రోజుల్లో రేటు 33 శాతం పెరిగింది. 2026 సంవత్సరం చివరికల్లా కిలో వెండి ధర రూ.3 లక్షలు దాటుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంకొందరు పరిశీలకులు అయితే, కిలో వెండి ధర రూ.4 లక్షలకు చేరుతుందని జోస్యం చెబుతున్నారు.












Click it and Unblock the Notifications