Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: లవర్స్ ఎంజాయ్, తల్లి బ్రైన్ వాష్, వేరే పెళ్లికి అమ్మాయి రెఢీ, నడిరోడ్డులో నరికేశాడు!

చెన్నై/మదురై: ప్రేమించిన అమ్మాయితో ఓ యువకుడు కొన్ని సంవత్సరాల పాటు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగేశాడు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ప్రియుడు ఊహల్లో తేలిపోయాడు. నీకు ప్రపంచంలో ఎవ్వరూ చిక్కలేదా ?, వేస్ట్ గాడిని పెళ్లి చేసుకుని నీ జీవితం నాశనం చేసుకుంటావా ? అంటూ అమ్మాయి తల్లి మండిపడింది. కూతురికి తల్లి బ్రైన్ వాష్ చేసింది. తల్లి చెప్పిన చోట పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన ప్రియురాలు నువ్వు పెళ్లి కొడుకును చూడాలని తల్లికి చెప్పింది.

తల్లి పెళ్లి కొడుకును చూస్తున్న సమయంలో విషయం ప్రియుడికి తెలిసింది. ప్రియురాలికి నచ్చచెప్పాలని అనేకసార్లు ప్రయత్నించి విసిగిపోయిన ప్రియుడు చివరికి ఆమెను నడిరోడ్డులో కొడవలితో నరికి చంపేయడం కలకం రేపింది.

కూతురు కోసం

కూతురు కోసం

తమిళనాడులోని కల్లకూరిచి జిల్లాలోని ఉలుండూర్ పేట్ సమీపంలోని కండలూర్ గ్రామంలో పళనిపిళై, సెల్వీ దంపతులు నివాసం ఉండేవారు. పళనిపిళై, సెల్వీ దంపతులకు ప్రేమా (20) అనే కుమార్తె ఉంది. అనారోగ్యంతో 10 సంవత్సరాల క్రితం పళనిపిళై మరణించాడు. అప్పటి నుంచి సెల్వీ కూతురు ప్రేమాతో కలిసి సొంత ఊర్లో నివాసం ఉంటున్నది.

ఆలయానికి వెళితే అబ్బాయి పరిచయం

ఆలయానికి వెళితే అబ్బాయి పరిచయం

10వ తరగతి పూర్తి చేసిన ప్రేమా తరువాత ఇంటర్ లో చేరకుండా ఇంటి దగ్గరే ఉంటూ తల్లికి ఇంటి పనిలో సహాయం చేస్తోంది. సెల్వీ కూతురిని పెంచి పోషించడానికి చిన్న ఉద్యోగం చేస్తున్నది. ప్రేమా ప్రతివారం చిన్నసలేం సమీపంలోని అమ్మయకరం గ్రామంలోని అమ్మవారిని ఆలయాన్ని సందర్శించడానికి వెళ్లేది. ఆ సమయంలో అదే గ్రామంలో నివాసం ఉంటున్న డ్రైవర్ బాలా (30) అనే యువకుడు ప్రేమాకు పరిచయం అయ్యాడు.

ప్రేమా, బాలా లవ్ స్టోరీ

ప్రేమా, బాలా లవ్ స్టోరీ

ఆలయం దగ్గరకు వెళ్లిన ప్రతిసారి బాలా ప్రేమా మాట్లాడుకోవడంతో వారి పరిచయం ప్రేమగా మారింది. బాలాకు ప్రేమా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అప్పటి నుంచి ఇద్దరూ హ్యాపీగా తిరుగుతూ ఎంజాయ్ చేశారు. ఎలాగైనా సరే ప్రేమాను పెళ్లి చేసుకుని జీవితం ఎంజాయ్ చెయ్యాలని బాలా డిసైడ్ అయ్యాడు.

తల్లి బ్రైన్ వాష్..... కూతురు రివర్స్

తల్లి బ్రైన్ వాష్..... కూతురు రివర్స్

బాలాతో తన కూతురు ప్రేమలో పడిందని ఆమె తల్లి సెల్వీకి తెలిసింది. ప్రపంచంలో ఎవ్వరూ చిక్కనట్లు పోయ్యిపోయ్యి డ్రైవర్ ను పెళ్లి చేసుకుంటావా ?, నీ జీవితనం నువ్వే నాశనం చేసుకుంటావా? అంటూ సెల్వీ కూతురు ప్రేమాకు చివాట్లు పెట్టి ఆమెకు బ్రైన్ వాష్ చేసింది. నేను చెప్పిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలని తల్లి సెల్వీ చెప్పడంతో కూతురు ప్రేమా ఓకే చెప్పింది.

విసిగిపోయిన ప్రియుడు

విసిగిపోయిన ప్రియుడు

కుమార్తె ప్రేమాకు పెళ్లి చెయ్యడానికి సెల్వీ పెళ్లి కొడుకు కోసం వెతకడం మొదలుపెట్టింది. ఇదే సమయంలో తన ప్రియురాలు ప్రేమాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని ఆమె ప్రియుడు బాలాకు తెలిసింది. ప్రియురాలికి నచ్చచెప్పి ఎలాగైనా ఆమెను నేను పెళ్లి చేసుకోవాలని బాలా ప్రేమాను కలవడానికి అనేకసార్లు ప్రయత్నించాడు. అయితే ప్రేమా మాత్రం అతని ఫోన్ లు రిసీవ్ చేసుకోకుండా తల్లి మాటకు కట్టుబడి అతన్ని పూర్తిగా దూరం పెట్టేసింది.

నడిరోడ్డులో నరికేశాడు

నడిరోడ్డులో నరికేశాడు

పని మీద ఇంటి నుంచి ప్రేమా బయటకు వెళ్లింది. విషయం తెలుసుకున్న ప్రియుడు బాలా ఆమెతో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ప్రేమా మాత్రం మాట్లాడటానికి చాన్స్ ఇవ్వకపోవడంతో ప్రియుడు బాలా రగిలిపోయాడు. ఇదే సమయంలో వెంట తీసుకెళ్లిన కొడవలి తీసుకున్న బాలా నడిరోడ్డులో ప్రియురాలు ప్రేమా మీద ఇష్టం వచ్చినట్లు నరికేశాడు.

Recommended Video

    Bengaluru : బిర్యానీ పిచ్చి.. ప్రాణాల కంటే బిర్యానే ఎక్కువా? || Oneindia Telugu
    నిమిషాల్లో ప్రాణం పోయింది

    నిమిషాల్లో ప్రాణం పోయింది

    కొడవలి దెబ్బలకు ప్రేమా నడిరోడ్డులోనే కుప్పకూలిపోయింది. విషయం గుర్తించిన స్థానికులు ప్రేమాను ఉలుండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ప్రేమాను ముండియంబక్కం మెడికల్ కాలేజ్ కు తరలించారు. చికిత్స విఫలమై ప్రేమా ప్రాణాలు గాలిలో కలిసిపోయారు. ప్రియురాలు ప్రేమాను హత్య చేసిన వెంటనే బాలా పరారైనాడని, అతన్ని వెతికి పట్టుకున్నామని పోలీసులు అన్నారు. పెళ్లికి నిరాకరించిన ప్రియురాలని ఆమె ప్రియుడు ఇంత దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+