Chennai Rains: చెన్నైలో భారీ వర్షాలు.. పలు విమానాలు రద్దు..

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి భారీ వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నై వణుకుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ద్రోణి ప్రభావంతో చెన్నై సిటీలో భారీ వర్షాలు కుస్తున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రతికూల వాతావరణంతో చెన్నై నుంచి వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి.

శనివారం మధ్యాహ్నం 15 విమానాలు చెన్నైలో ఎయిర్ పోర్టులో ల్యాండ్‌ అయ్యేందుకు సిద్ధం కాగా.. వాతావరణం అనుకూలించలేదు. దీంతో విమానాలు పైనే చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత నాలుగు విమానాలను బెంగళూరు మళ్లించారు. నగరంలోని నుంగంబాక్కం, మీనంబాక్కం అబ్జర్వేటరీలలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలై 13 నుండి జూలై 19 వరకు అక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

Airport officials said that many flights have been canceled due to heavy rains in Chennai

శివారు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం వరకు వర్షం కురిసిన తర్వాత, మేఘావృతమైన ఆకాశం శనివారం పగటి ఉష్ణోగ్రతలు 33C, 33.2Cకి పడిపోయాయి. "రాబోయే 48 గంటల పాటు, నగరం, శివారు ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చు. గరిష్ట మరియు కనిష్ట ఉష్ణోగ్రతలు 33C-34C మరియు 25C-26C వద్ద ఉండవచ్చు" అని IMD బులెటిన్ తెలిపింది.

జూలై 1 నుంచి నుంగంబాక్కం, మీనంబాక్కంలో దాదాపు 17 సెం.మీ, 15 సెం.మీ వర్షపాతం నమోదైంది. జూలై 2021లో 25cm వర్షపాతం నమోదైంది. ఇది 10 సంవత్సరాలలో నెలలో అత్యధికం. జూలై 2001లో ఆల్ టైమ్ రికార్డు 27సెం.మీ. జూన్, జూలై నెలలలో నుంగంబాక్కంలో సగటున 6 సెం.మీ, 10 సెం.మీ వర్షపాతం నమోదవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+