Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

girl: పెళ్లికి ముందే 8 నెలల గర్బవతి అయిన బీఇడీ కాలేజ్ అమ్మాయి, పెళ్లి ఫిక్స్, ప్రియుడి ఇంట్లోనే శవం?

కాలేజ్ అమ్మాయి పెళ్లికి ముందే 8 నెలల గర్బవతి అయ్యింది. పెద్దలు పంచాయితీలు చేసి ప్రేమికులకు పెళ్లి చెయ్యాలని డేట్ ఫిక్స్ చేశారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ప్రియుడి ఇంటి వెనుక ప్రియురాలు శవమై కనిపించింది.

చెన్నై/తిరువారూర్: యువతి, యువకుడు కాలేజ్ చదువుకున్నారు. వేర్వేరు కాలేజీల్లో చదువుకున్న ఇద్దరికి పరిచయం అయ్యింది. యువకుడి ఇంటి సమీపంలోని యువతి అమ్మమ్మ ఇల్లు ఉంది. అమ్మమ్మ ఇంటికి ఎక్కువగా వెళ్లి వస్తున్న యువతి ఆ యువకుడి ప్రేమలో పడింది. బయట ఎక్కువగా ఏకాంతంగా కలుసుకుంటున్న ప్రేమికులు శారీరక సంబంధం పెట్టుకున్నారు. ఎప్పుడుపడితే అప్పుడు ప్రియుడితో శారీరకంగా కలిసిన కాలేజ్ అమ్మాయి గర్బవతి అయ్యింది.

విషయం బయటకు తెలిసే సరికి యువతి తల్లి అయ్యింది. పెళ్లికాకుండా తల్లి అయిన యువతి ఆమె ప్రియుడితో కలిసి పారిపోయింది. పెద్దలు పంచాయితీలు చేసి ప్రేమికులకు పెళ్లి చెయ్యాలని డేట్ ఫిక్స్ చేశారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో ప్రియుడి ఇంటి వెనుక ప్రియురాలు శవమై కనిపించడం కలకలం రేపింది.

యువతి, యువకుడు?

యువతి, యువకుడు?

తమిళనాడులోని తిరువారూరు జిల్లాలోని మెప్పలం ప్రాంతానికి చెందిన మురుగయ్య కుమారుడు నరేష్ కుమార్ (24) బీకామ్ పూర్తి చేసి తిరువారూరులోని ఓ హోటల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.

తిరువారూరు జిల్లా కమలాపురం నాథం ప్రాంతానికి చెందిన రామకృష్ణన్ కుమార్తె సుస్మిత (21)తో కళాశాలలో చదువుతున్న సమయంలో నరేష్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. నరేష్ కుమార్ ఇంటికి సమీపంలోనే సుస్మిత అమ్మమ్మ ఇల్లు ఉంటుంది.

బీఇడీ చదువుతున్న ప్రియురాలు

బీఇడీ చదువుతున్న ప్రియురాలు

నరేష్ కుమార్, సుస్మిత గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. సుస్మిత డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం బీఇడీ చదువుతోంది. సుస్మిత బయట ఊర్లో ఉంటున్నది. ప్రేమికులు సుస్మిత, నరేష్ కుమార్ తరచూ ఏకాంతంగా కలుసుకోవడం మొదలుపెట్టారు.

అమ్మమ్మ ఇంటికి వెళ్లిన సమయంలో, కాలేజ్ పూర్తి అయిన తరువాత సుస్మిత ఆమె ప్రియుడు నరేష్ కుమార్ తో ఏకాంతంగా ఉంటూ అతనితో శారీరక సంబందం పెట్టుకుంది. ఎప్పుడుపడితే అప్పుడు సుస్మిత ఆమె ప్రియుడు నరేష్ కుమార్ ను కలవడం మొదలు పెట్టింది.

పెళ్లికి ముందే ప్రియురాలు 8 నెలల గర్బవతి

పెళ్లికి ముందే ప్రియురాలు 8 నెలల గర్బవతి

సుస్మిత గర్భిణి అయ్యింది. నరేష్ కుమార్ తో పెళ్లి చేసుకోవడానికి వీలులేదని సుస్మిత ఇంటికి తేల్చి చెప్పారు. నరేష్ కుమార్, సుస్మిత పెళ్లికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో సుస్మిత నెల రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి పెళ్లి చేసుకోకుండానే ఆమె ప్రియుడు నరేష్‌కుమార్‌ ఇంటిలో ఉంటున్నది, నరేష్ కుమార్ కుటుంబ సభ్యులు మాత్రం వారి పెళ్లికి అంగీకరించారు.

ఫిబ్రవరి 12 పెళ్లి చెయ్యాలని పెద్దలు పంచాయితీ

ఫిబ్రవరి 12 పెళ్లి చెయ్యాలని పెద్దలు పంచాయితీ

ఇటీవల గ్రామ పంచాయతీ పెద్దలు ప్రేమికులు నరేష్ కుమార్, సుస్మితలతో దండలు మార్పించారు. ఫిబ్రవరి 12న వారిద్దరికీ పెళ్లి చేయాలని గ్రామ పంచాయతీ పెద్దలు కూడా నిర్ణయించారు. సుస్మిత ఆమె ప్రియుడు నరేష్‌కుమార్‌ ఇంట్లోనే ఉండిపోయింది. పెళ్లికాకుండానే తల్లి అయిన సుస్మిత ప్రియుడి ఇంటిలో ఉంటూ సంతోషంగానే ఉందని తెలిసింది.

బట్టలు, తాళి కొనడానికి వెళ్లిన టైమ్ లో ప్రియురాలు ఆత్మహత్య ?

బట్టలు, తాళి కొనడానికి వెళ్లిన టైమ్ లో ప్రియురాలు ఆత్మహత్య ?

మరో మూడు రోజుల్లో పెళ్లి జరగనుండడంతో నరేష్‌కుమార్ తల్లి, బంధువులు పెళ్లికి బట్టలు, తాళి కొనుగోలు చేసేందుకు తిరువారూరు వెళ్లారు. ఆ సమయంలో నరేష్ కుమార్ కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్న సుస్మిత ఇంటి వెనుక ఉన్న ఓ షెడ్డులో రూఫ్ కు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్మ చేసుకుందని పోలీసులకు సమాచారం అందింది. ప్రియుడు నరేష్ కుమార్ బయటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లి చూసి అతను కేకలు వెయ్యడంతో ఇరుగుపొరుగు వారు పరిగెత్తుకుంటూ వచ్చి సుస్మిత మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు.

ఇంతలో ఏం జరిగింది?

ఇంతలో ఏం జరిగింది?

కొరడాచెరి పోలీసులు సుస్మితా మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తిరువారూరు ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. సుస్మిత హత్యాకు గురైయ్యిందా, లేక ఆత్మహత్యా చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. సుస్మిత ప్రియుడి ఇంట్లో వెనుక అనుమానాస్పదంగా శవమై కనిపించడంతో పోలీసులు ఆమె ప్రియుడు నరేష్ కుమార్, అతని కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

పెళ్లికి మూడు రోజుల ముందు ఓ గర్భిణి ఉరివేసుకుని మృతి చెందడంతో ఆ మహిళ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించడంతో ఆ ప్రాంతంలోని ప్రజలు విషాదం వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణలో ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+