Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మరో కీచకుడు... చెన్నై శివశంకర్ బాబా అరెస్ట్... స్కూల్ విద్యార్థినులపై లైంగిక వేధింపులు

స్వయంప్రకటిత దేవుడు,చెన్నైలోని సుశీల్ హరి రెసిడెన్షియల్ స్కూల్ వ్యవస్థాపకుడు శివశంకర్ బాబాను ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సీబీసీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

సుశీల్ హరి రెసిడెన్షియల్ స్కూల్‌కి చెందిన కొంతమంది పూర్వ విద్యార్థులు శివ శంకర్ బాబా గతంలో తమను లైంగిక వేధింపులకు గురిచేశాడని మహాబలిపురంలోని ఆల్ విమెన్ పోలీస్ స్టేషన్(AWPS)లో ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద శివ శంకర్ బాబాపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

chennai shiva shankar baba arrest for allegedly abused students sexually

తనపై కేసులు నమోదయ్యాయనే విషయం తెలిసి శివశంకర్ బాబా చెన్నై నుంచి ఉత్తరాఖండ్ పారిపోయాడు.అక్కడ డెహ్రాడూన్‌లోని ఓ ఆస్పత్రిలో చేరాడు.ఇదే క్రమంలో కేసు క్రైమ్ బ్రాంచ్-సీఐడీ విభాగానికి బదిలీ అయింది. రంగంలోకి దిగిన సీబీ సీఐడీ స్పెషల్ టీమ్ శివశంకర్ బాబా డెహ్రాడూన్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు గుర్తించారు. సీబీ-సీఐడీ తన ఆచూకీ కనిపెట్టిందన్న విషయం తెలిసి శివశంకర్ బాబా ఆస్పత్రి నుంచి మకాం మార్చాడు. ఢిల్లీ శివారులోని ఘజియాబాద్‌లో తన భక్తురాలైన ఓ మహిళ ఇంట్లో ఆశ్రయం పొందాడు. పోలీసులు ఫోన్ నంబర్ ద్వారా ఆమె ఇంటి ఆచూకీని కనిపెట్టి.. ఎట్టకేలకు శివశంకర్ బాబాను అరెస్ట్ చేశారు.

అరెస్ట్ అనంతరం శివశంకర్ బాబాను చెన్నైకి తరలించిన పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. శివశంకర్ బాబాను కఠినంగా శిక్షించాలని బాధిత విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.

కొద్దిరోజుల క్రితమే చెన్నైలోని పద్మశేషాద్రి బాలభవన్‌తో పాటు మరో ప్రైవేట్ పాఠశాలలో ఇద్దరు కీచక టీచర్ల వేధింపులు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. బాధిత విద్యార్థినుల ఫిర్యాదుతో వేధింపుల పర్వం వెలుగుచూసింది. ఇదే చెన్నైకి చెందిన శివశంకర్ బాబా కూడా లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్టవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+