Girlfriend: నిశ్చితార్థం క్యాన్సిల్, చేతులు ఎత్తేసిన ప్రియుడు, పోలీసుల చేతులు కోరికేసిన ప్రియురాలు, రివర్స్!
చెన్నై/తిరువళ్లూరు: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. చాలాకాలం పాటు ప్రేమికులు సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేశారు. ప్రేమికులు ఇరువైపుల కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి పెళ్లికి ఒప్పించారు. ప్రేమికుల కుటుంబ సభ్యులు అందరూ కలుసుకుని నిశ్చితార్థం జరిపించారు. తరువాత పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు కట్నం, కారు, తొక్క, తొటారం అంటూ డిమాండ్లు ముందు పెట్టారు.
నిశ్చితార్థం రద్దు చేసిన పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు వేరే యువతితో ప్రియుడికి పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యారు. ప్రియురాలు పెళ్లి కొడుకు ఇంటి దగ్గరకు వెళ్లి రచ్చరచ్చ చేసింది. రాజీ చెయ్యడానికి వెళ్లిన పోలీసు చేతులు కొరికేసి బట్టలు చింపేసిన ప్రియురాలు నానా రాద్దాంతం చెయ్యడం కలకలం రేపింది.

గ్రేట్ లవర్స్
తమిళనాడులోని తిరువళ్లూరులో దేవేంద్రన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పుదువన్నార్ పేట్ లో నివాసం ఉంటున్న సెల్వీకి, దేవేంద్రన్ కు పరిచయం అయ్యింది. కొంతకాలం స్నేహితులుగా ఉన్న దేవేంద్రన్, సెల్వీ ప్రేమించుకున్నారు. చాలాకాలం పాటు ప్రేమికులు దేవేంద్రన్, సెల్వీ సరదాగా గడుపుతూ ఎంజాయ్ చేశారు.

పెళ్లి కొడుకు ఫ్యామిలీ రివర్స్
ప్రేమికులు దేవేంద్రన్, సెల్వీ వాళ్ల కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి పెళ్లికి ఒప్పించారు. ప్రేమికుల కుటుంబ సభ్యులు అందరూ కలుసుకుని దేవేంద్రన్, సెల్వీల పెళ్లి నిశ్చితార్థం గ్రాండ్ గా జరిపించారు. తరువాత పెళ్లి కొడుకు దేవేంద్రన్ కుటుంబ సభ్యులు కట్నం, కారు, బంగారు నగలు, బైక్ కావాలని డిమాండ్ చేశారు.

పెళ్లి క్యాన్సిల్....... ప్రియుడు సైలెంట్
నిశ్చితార్థం రద్దు చేసిన పెళ్లి కొడుకు దేవేంద్రన్ కుటుంబ సభ్యులు వేరే యువతితో ప్రియుడికి పెళ్లి చెయ్యడానికి సిద్దం అయ్యారు. విషయం తెలుసుకున్న సెల్వీ ఆమె ప్రియుడు దేవేంద్రన్ మనసు మార్చడానికి అనేక ప్రయత్నాలు చేసింది. అయితే చేసిందంతా చేసేసిన దేవేంద్రన్ నేను మా ఇంట్లో చెప్పినట్లు వింటాను అంటూ సెల్వీకి తేల్చి చెప్పాడు.

పోలీసుల చేతులు కోరికేసిన ప్రియురాలు
ప్రియురాలు సెల్వీ ఆమె ప్రియుడు దేవేంద్రన్ ఇంటి దగ్గరకు వెళ్లి రచ్చరచ్చ చేసింది. రాజీ చెయ్యడానికి తిరువొత్తియూర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానీస్టేబుల్ శరవణన్ వెళ్లి సెల్వీతో మాట్లాడి రాజీ చెయ్యడానికి ప్రయత్నించాడు. ఆ సందర్బంలో సహనం కోల్పోయిన సెల్వీ హెడ్ కానిస్టేబుల్ శరవణన్ చేతులు కొరికేసి ఆయన బట్టలు చింపేసి నానా రాద్దాంతం చేసింది.

లేడీ పోలీసులు ఎంట్రీ
బిత్తరపోయిన హెడ్ కానిస్టేబుల్ శరవణన్ మహిళా పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళా పోలీసులు వెళ్లి సెల్వీని అదుపులోకి తీసుకుని రాజీ చెయ్యడానికి ప్రయత్నించారు. మొత్తం మీద ప్రియుడు మోసం చేశాడని గొడవ చేసిన ప్రియురాలు సెల్వీ పోలీసు చేతులు కోరికేసి బట్టలు చింపేయడం తిరువళ్లూరులో చెయ్యడం కలకలం రేపింది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications