Illegal love: అక్రమ సంబంధం, ప్రియుడితో భార్య స్కెచ్, ఫ్రెండ్స్ తో భర్త రివర్స్ స్కెచ్, క్లైమాక్స్!

చెన్నై/ తిరువున్నామలై: జైల్లో ఉన్న భర్తను విడిపించి బయటకు తీసుకువచ్చే సమయంలో అతని స్నేహితుడిని వలలో వేసుకున్న భార్య ఎంజాయ్ చేసింది. తన భర్త ఎంతకాలం జైల్లో ఉంటే తనకు అంత మంచిదని ఆ భార్య అనుకుంది. భర్త జైల్లో ఉన్న విషయం ఏమాత్రం పట్టించుకోని భార్య ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తూ కాలం గడిపింది.

Recommended Video

    Vanitha Vijayakumar 3rd Marriage మూడో పెళ్లిపై యంకర్, నటి చేసిన కామెంట్స్, వనితా రియాక్షన్ వైరల్!!

    తెలిసిన వాళ్ల కాళ్లు పట్టుకుని జైలు నుంచి బయటకు వచ్చిన భర్తను అంతం చెయ్యాలని ప్రియుడితో కలిసి భార్య స్కెచ్ వేసింది. తన భార్య, ఆమె ప్రియుడు తనను చంపాలనుకుంటున్నారని తెలుసుకున్న భర్త రగిలిపోయాడు. అంతే రివర్స్ స్కెచ్ వేసిన భర్త చివరికి భార్య ప్రియుడు అయిన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు.

     ఫ్యాక్టరీలో ఉద్యోగం... పార్ట్ టైమ్ లూటీలు

    ఫ్యాక్టరీలో ఉద్యోగం... పార్ట్ టైమ్ లూటీలు

    తమిళనాడులోని తిరువున్నామలై సమీపంలోని ఎహిల్ అనే ప్రాంతంలో చండవాసల్ నివాసి నిత్యానంద (26), శ్రీవిల్లుపుత్తూరు నివాసి ఫిలిప్ (25), ప్రతాప్ (27), పూవరాసన్ (25) అనే స్నేహితులు నివాసం ఉంటున్నారు. నిత్యానంద, ఫిలిప్, ప్రతాప్, పూవరాసన్ శ్రీపెరంబూరు సమీపంలోని ఓ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు చేస్తున్నారు. పగలు ఫ్యాక్టరీల్లో ఉద్యోగాలు చెయ్యడం, రాత్రి పార్ట్ టైమ్ గా ప్రయాణికులను నిలువు దోపిడీ చెయ్యడం, బైక్ లు చోరీలు చెయ్యడం ఈ స్నేహితులు పనిగా పెట్టుకున్నారు.

    నిత్యానంద భార్య సత్య

    నిత్యానంద భార్య సత్య

    నిత్యానందకు సత్య అనే యువతితో వివాహం అయ్యింది. నిత్యానంద భార్య మీద ప్రతాప్ కు కొంతకాలం నుంచి కన్నుపడింది. అయితే సరైన టైమ్ చిక్కక ప్రతాప్ ఫ్రెండ్ భార్య సత్యతో లైన్ లో పెట్టడానికి ఎదురు చూశాడు. ఇదే సమయంలో ఓ బైక్ చోరీ కేసులో ప్రతాప్ అను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని జైలుకు పంపించారు.

    భార్య సత్యకు నిత్యానంద సలహా

    భార్య సత్యకు నిత్యానంద సలహా

    జైల్లో ఉన్న భర్త నిత్యానందను సత్య కలిసింది. ఆ సమయంలో మేము కలిసి చోరీలు చేసే సమయంలో ప్రతాప్ దగ్గర తనకు రావలసి డబ్బులు ఉందని, ఆ డబ్బు తీసుకుని ప్రతాప్ సహాయంతో తనకు బెయిల్ తీసుకోని తనను జైలు నుంచి బయటకు తీసుకురావాలని నిత్యానంద భార్య సత్యకు చెప్పాడు.

    భలే చాన్స్ చిక్కింది సత్య

    భలే చాన్స్ చిక్కింది సత్య

    భర్త బెయిల్ కోసం సత్య అతని ఫ్రెండ్ ప్రతాప్ ను కలిసింది. తన భర్త ప్రతాప్ ను బెయిల్ మీద బయటకు తీసుకురావాలని సత్య ప్రతాప్ కు చెప్పింది. వాడు జైల్లోనే ఉండని, మనం ఎంజాయ్ చేద్దాం అంటూ ప్రతాప్ ఫ్రెండ్ భార్యను రెచ్చగొట్టాడు. ఇలా భర్త నిత్యానంద ఫ్రెండ్ ప్రతాప్ తో అక్రమ సంబంధం పెట్టుకున్న ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సత్య అతనితో ఎంజాయ్ చేస్తూ వచ్చింది. భర్త నిత్యానంద జైల్లో ఉన్నాడని, అతన్ని బెయిల్ మీద బయటకు తీసుకురావాలని సత్య పూర్తిగా మరిచిపోయింది.

    జైలు నుంచి వస్తే భర్త హత్యకు స్కెచ్

    జైలు నుంచి వస్తే భర్త హత్యకు స్కెచ్

    రెండు నెలలు జైల్లో ఉన్న నిత్యానంద అతి కష్టం మీద తెలిసిన వాళ్ల సహాయంతో బెయిల్ తీసుకుని బయటకు వచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన నిత్యానందను చంపేసి మనం ఎంజాయ్ చేద్దాం అంటూ సత్య ప్రియుడు ప్రతాప్ ను రెచ్చగొట్టింది. రెండుమూడు సార్లు నిత్యానందను హత్య చెయ్యడానికి ప్రతాప్ అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు. తనను చంపడానికి తన భార్య సత్య, ప్రతాప్ ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న నిత్యానంద రగలిపోయాడు.

    నిత్యానంద రివర్స్ స్కెచ్ తో ఔట్

    నిత్యానంద రివర్స్ స్కెచ్ తో ఔట్

    జూన్ 16వ తేదీన ఫ్యాక్టరీలో పనికి వెళ్లిన ప్రతాప్ ను అదే రోజు రాత్రి నిత్యానంద, అతని స్నేహితులు ఫిలిప్, పూవరాసన్ పిలుచుకుని వెళ్లారు. ప్రతాప్ తో పీకలదాక మద్యం తాగించిన నిత్యానంద అతని ఇద్దరు స్నేహితులతో కలిసి ప్రతాప్ గొంతు కోసి దారుణంగా చంపేశారు. ప్రతాప్ శవానికి పెద్ద బండరాయి కట్టి తీసుకెళ్లి పాడుపడిన బావిలో వేసి పైన ముళ్ల కంపలు, కట్టెలు వేశారు. ప్రతాప్ శవం ఏమైనా నీళ్లలో తేలుతుందా అనే భయంతో అప్పుడప్పుడు బావి దగ్గరకు వెళ్లి చూసి వస్తున్నారు.

    నెల రోజులకు క్లైమాక్స్

    నెల రోజులకు క్లైమాక్స్

    ప్రతాప్ ఇంటి నుంచి వెళ్లి నెల రోజులు అయినా తిరిగిరాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రతాప్ గురించి పోలీసులు ఆరా తీసినా ఎలాంటి వివరాలు వెలుగు చూడలేదు. ఇదే సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిత్యానంద, ఫిలిప్, పూవరాసన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ముగ్గురికి బెండ్ తిసి విచారణ చెయ్యగా థ్రిల్లర్ సినిమా స్టోరీ మొత్తం బయటకు వచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+