Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Illegal affair: అక్కకు చిన్న వయసు ప్రియుడు, మరో అక్క కిలాడీ, తమ్ముడి హత్యకు ఇద్దరు అక్కలు స్కెచ్, రివర్స్!

చెన్నై/దిండుగల్: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న మహిళ ఆమె భర్తతో కాపురం చేసింది. భర్త అనారోగ్యంతో చనిపోవడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటిలో నివాసం ఉంటున్న మహిళ ఆమె కంటే తక్కువ వయసు ఉన్న యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం వీళ్ల అక్రమ సంబంధం విషయం సీక్రేట్ గా సాగిపోయింది. చెల్లెలి అక్రమ సంబంధానికి ఆమె అక్క కూడా సహకరించింది. మహిళ అక్రమ సంబంధం విషయం ఆమె తమ్ముడికి తెలిసిపోయింది.

నువ్వు పద్దతి మార్చుకోకపోతే నిన్ను, మీ అక్కను, మీ ప్రియుడిని చంపేస్తానని తమ్ముడు అతని అక్కలు ఇద్దరినీ హెచ్చరించాడు. తన తమ్ముడు బతికున్నంత వరకు మనం కలవడం సాధ్యం కాదని, వాడిని చంపేయాలని సొంత అక్క ఆమె ప్రియుడికి చెప్పింది. అక్కలు ఇద్దరూ వారి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తమ్ముడి హత్యకు స్కెచ్ వేశారు. ప్రియుడు అతని స్నేహితులు కిలాడీ లేడీస్ తమ్ముడిని కత్తులతో పొడిచి వేటకొడవళ్లతో నరికేయడం కలకలం రేపింది. తమ్ముడు బతికి పోయి ఐసీయూలో ఉన్నాడని తెలుసుకున్న ఓ అక్క భయంతో విషం తాగేసింది.

భర్త చనిపోయాడని?

భర్త చనిపోయాడని?

తమిళనాడులోని దిండుగల్ జిల్లాలోని కుడైసరాయిపట్టిలో మనీషా అనే మహిళ నివాసం ఉంటున్నది. 9 సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని మనీషా పెళ్లి చేసుకుని ఆమె భర్తతో కాపురం చేసింది. మూడు సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోవడంతో మనీషా ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

ప్రియుడిని సెట్ చేసుకున్న మనీషా

ప్రియుడిని సెట్ చేసుకున్న మనీషా

పుట్టింటిలో నివాసం ఉంటున్న మనీషా ఆమె కంటే తక్కువ వయసు ఉన్న సర్దార్ (25) అనే యువకుడితో పరిచయం పెంచుకుని రానురాను అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొంతకాలం మనీషా, సర్దార్లల అక్రమ సంబంధం విషయం చాలా సీక్రేట్ గా సాగిపోయింది. ప్రియుడు సర్దార్ తో విహారయాత్రలకు వెలుతున్న మనీషా అతనితో పిచ్చపాటిగా ఎంజాయ్ చేసింది.

అక్క సహాయం..... తమ్ముడు ఫైర్

అక్క సహాయం..... తమ్ముడు ఫైర్

చెల్లెలు అక్రమ సంబంధం విషయం తెలుసుకున్న ఆమె అక్క సీమాదేవి చెల్లెలు బయట తిరగడానికి పూర్తిగా సహకరించింది. మనీషాకు సూర్యా అనే తమ్ముడు ఉన్నాడు. ఎక్కువ మంది స్నేహితులతో జలాయిగా తిరుగుతున్న సూర్యాకు అతని అక్క మనీషా అక్రమ సంబంధం విషయం తెలిసిపోయింది. నువ్వు పద్దతి మార్చుకోకపోతే నిన్ను, మీ అక్క సీమాదేవిని, మీ ప్రియుడు సర్దార్ ను చంపేస్తానని తమ్ముడు సూర్యా అతని ఇద్దరు అక్కలను హెచ్చరించాడు.

తమ్ముడి హత్యకు సొంత అక్కలు స్కెచ్

తమ్ముడి హత్యకు సొంత అక్కలు స్కెచ్

కొంతకాలం మనీషాను ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వకుండా సూర్యా అడ్డుకున్నాడు. మనీషా దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ను సూర్యా లాక్కొన్నాడు. తన తమ్ముడు సూర్యా బతికున్నంత వరకు మనం కలవడం సాధ్యం కాదని, వాడిని చంపేయాలని సొంత అక్క మనీషా ఆమె ప్రియుడు సర్దార్ కు చెప్పింది. అక్కలు మనీషా, సీమాదేవి ఇద్దరూ వారి అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న తమ్ముడు సూర్యా హత్యకు స్కెచ్ వేశారు.

నిద్రపోతుంటే నరికేశారు.... చనిపోయాడని వదిలేశారు

నిద్రపోతుంటే నరికేశారు.... చనిపోయాడని వదిలేశారు

ప్రియుడు సర్దార్ అతని స్నేహితులు యోగరాజ్, గౌతమ్, రియాజ్ లతో కలిసి కిలాడీ లేడీస్ మనీషా, సీమాదేవి తమ్ముడు సూర్యా ఇంట్లో నిద్రపోతున్న సమయంలో కత్తులతో పొడిచి వేటకొడవళ్లతో నరికేశారు. తీవ్రగాయాలైన సూర్యా చనిపోయాడని అతన్ని వదిలేసి వెళ్లిపోయారు. సూర్యాను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

అడ్డంగా చిక్కిపోయిన అక్కలు, ప్రియుడు, ఫ్రెండ్స్

అడ్డంగా చిక్కిపోయిన అక్కలు, ప్రియుడు, ఫ్రెండ్స్

తమ్ముడు సూర్యా బతికిపోయి ఐసీయూలో ఉన్నాడని తెలుసుకున్న అతని అక్క మనీషా భయంతో విషం తాగేసింది. మనీషాను ఆసుపత్రిలో చేర్పించారు. సూర్యాను చంపడానికి ప్రయత్నించి అతని అక్క మనీషా ప్రియుడు సర్దార్, గౌతమ్, యోగరాజ్, రియాజ్ ను అరెస్టు చేశామని, మనీషా, సీమాదేవీలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని దిండుగల్ పోలీసు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+