లవ్ మ్యారేజ్, ప్రియుడితో రొమాన్స్ చేసి బైక్ లో వెలుతున్న భార్యను ?, వీడు మగాడురా బుజ్జీ, ఫినిష్ !
చెన్నై/ టీ నగర్: యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కొంతకాలం ప్రేమించుకున్న తరువాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం అయిన తరువాత దంపతులకు పిల్లలు పుట్టారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న మహిళ ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేస్తోంది. ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసి బైక్ లో ఇంటికి వస్తున్న భార్యను, ఆమె ప్రియుడిని బైక్ మీదనే భర్త దాడి చెయ్యడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాకు చెందిన శివకుమార్ అలియాస్ శివ (33) అనే యువకుడు, అదే ప్రాంతంలో నివాసం ఉండే భూమాదేవి అలియాస్ దేవి (30) అనే యువతి ప్రేమించుకున్నారు. కొన్ని సంవత్సరాలు ప్రేమించుకున్న శివ, దేవి తరువాత లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. శివ, దేవి దంపతులు చక్కగా కాపురం చెయ్యడంతో వీరికి 8 ఏళ్ల కుమార్తె, ఆరు సంవత్సరాలు వయసు ఉన్న కుమారుడు ఉన్నారు.

శివ, దేవి దంపతులు చెన్నై సిటీకి చేరుకుని తాంబరం సమీపంలోని మణిమంగళంలో కాపురం ఉంటున్నారు. భర్త శివ ప్రతిరోజు పనికి వెళ్లి వస్తున్నాడు. ఇదే సందర్బంలో శివ భార్య దేవికి ఒరత్తూరులో నివాసం ఉంటున్న సుందర్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. సందర్, దేవిల పరిచయం రానురాను అక్రమ సంబంధానికి దారి తీసింది.
అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు సుందర్ తో దేవి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోంది. ప్రియుడు సుందర్ బైక్ లో నిర్జనప్రదేశాలకు వెలుతున్న దేవి అతనితో ఎంజాయ్ చేసి భర్త శివ ఇంటికి వచ్చే ముందు ఆమె ఇంటికి చేరుకుని ఏమీ తెలియని నంగనాచిలా ఉంటున్నది. ఇంతకాలం దేవి, సుందర్ ల అక్రమ సంబంధం విషయం సీక్రేట్ గా ఉండిపోయింది. అయితే నాలుగు నెలల క్రితం భార్య దేవి అక్రమ సంబంధం విషయం ఆమె భర్త శివకు తెలిసిపోయింది.
మూడు నెలల నుంచి ప్రతిరోజు ప్రియుడు సుందర్ విషయంలో దేవి, శివ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దేవి, ఆమె ప్రియుడు సుందర్ రహస్య ప్రాంతానికి వెళ్లి రొమాన్స్ చేసి తరువాత బైక్ లో దేవి ఇంటి దగ్గరకు బయలుదేరారు. మార్గం మధ్యలో శివ అతని భార్య దేవి వెలుతున్న బైక్ ను మరో బైక్ తో ఢీకొట్టాడు.
తరువాత దేవి, ఆమె ప్రియుడు సుందర్ బైక్ లో నుంచి కిందకు పడిపోయారు. వెంటనే ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే బైక్ లో నుంచి కిందపడిన దేవి తలకు తీవ్రగాయాలు కావడంతో ఆమె అప్పటికే చనిపోయిందని వైద్యులు చెప్పారని పోలీసులు తెలిపారు. భార్యను చాకచక్యంగా హత్య చేసిన శివను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ సంబంధం పెట్టుకున్న భార్య దేవిని ఆమె భర్త శివ పక్కాప్లాన్ తో హత్య చెయ్యడం చెన్నైలో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications