Wife: ప్రియుడి మైకంలో భార్య రొమాన్స్, చెప్పినా ఎవ్వరూ మాట వినలేదు. నడిరోడ్డులో భర్త ఏం చేశాడంటే!

చెన్నై/సేలం: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు పెళ్లి వయసుకు వచ్చిన కుమారుడు ఉన్నాడు. భార్యకు ఆమె కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తితో పరిచయం అయ్యింది. ప్రియుడిని సెట్ చేసుకున్న ఆమె అతనితో ఎంజాయ్ చేసింది.

భార్య అక్రమ సంబంధం మ్యాటర్ ఆమె భర్తకు తెలిసింది. పద్దతి మార్చుకోవాలని భర్త అతని భార్యను హెచ్చరించాడు. అయితే ప్రియుడి మోజులో పడిపోయిన మహిళ అతన్ని రహస్యంగా కలుసుకుంటున్నది. భార్య తీరుతో భర్త విసిగిపోయాడు. భర్త అతని భార్య ప్రియుడిని ఇనుపరాడ్ తో కొట్టి కత్తులతో పొడిచి చంపేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

దంపతులకు కొడుకు

దంపతులకు కొడుకు

తమిళనాడులోని సేలం జిల్లాలోని ఏర్కాడ్ లోని నార్తన్ చడ్ హిల్ ఏరియా సమీపంలోని కుంబపడి గ్రామంలో తంగరాజ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 22 ఏళ్ల క్రితం పుప్పా అనే మహిళను తంగరాజ్ వివాహం చేసుకున్నాడు. భర్త తంగరాజ్ తో పుష్పా చాలా సంతోషంగా కాపురం చేసింది. తంగరాజ్, పుష్పా దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు.

కూరగాయాల వ్యాపారం

కూరగాయాల వ్యాపారం

పుప్పా కూరగాయల మార్కెట్ లో కూరగాయల వ్యాపారం చేస్తోంది. అదే ప్రాంతంలో కూరగాయాల వ్యాపారం చేస్తున్న శివకుమార్ (40) డబ్బులు బాగా సంపాధిస్తున్నాడు. గత ఏడాదిలో పుష్పాకు ఆమె కంటే తక్కువ వయసు ఉన్న శివకుమార్ తో పరిచయం అయ్యింది. ఒకే ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న శివకుమార్, పుష్పా కొంతాలం మాట్లాడుకున్నారు.

ప్రియుడితో ఎంజాయ్

ప్రియుడితో ఎంజాయ్

రానురాను శివకుమార్, పుష్పా చనువు పెంచుకున్నారు. కొంతకాలం తరువాత ఇద్దరి పరిచయం మరో రూట్ లో వెళ్లింది. ప్రియుడు శివకుమార్ ను సెట్ చేసుకున్న పుష్పా అతనితో అక్రమ సంబంధం పెట్టుకుని ఎంజాయ్ చేసింది. కూరగాయల వ్యాపారం చెయ్యడానికి బయటకు వెలుతున్న పుష్పా పనిలోపనిగా ప్రియుడు శివకుమార్ తో తిరుగుతూ జల్సా చేసింది.

భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త

భార్యకు వార్నింగ్ ఇచ్చిన భర్త

పుష్పా, శివకుమార్ విచ్చలవిడిగా తిరగడంతో ఆ విషయం పుష్పా భర్త తంగరాజ్ కు, శివకుమార్ కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది. పద్దతి మార్చుకోవాలని తంగరాజ్ అతని భార్య పుష్నాకు వార్నింగ్ ఇచ్చాడు. పిల్లలు పుట్టిన తరువాత నువ్వు చేస్తున్న పద్దతి ఏమీ బాగాలేదని శివకుమార్ ను అతని కుటుంబ సభ్యులు మందలించారు.

సీక్రేట్ గా రొమాన్స్

సీక్రేట్ గా రొమాన్స్

కుటుంబ సభ్యులు మందలించడంతో పుష్పా. శివకుమార్ రహస్యంగా కలుసుకోవడం మొదలుపెట్టారు. అయితే శివకుమార్ ను పుష్పా వదలుకోవడానికి అంగీకరించలేదని తెలిసింది. పుష్పా పద్దతి మార్చుకోకపోవడంతో ఆమె ప్రియుడు శివకుమార్ ను చంపేయాలని భర్త తంగరాజ్, అతని తండ్రి మాణిక్యం డిసైడ్ అయ్యారు.

భర్త మీద ప్రియుడి ఎదురుదాడి

భర్త మీద ప్రియుడి ఎదురుదాడి

ప్రియుడు శివకుమార్ మోజులో పడిపోయిన పుష్పా అతన్ని రహస్యంగా కలుసుకుంటూ ఆమె కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టింది. భార్య పుష్పా తీరుతో విసిగిపోయిన తంగరాజ్ అతని తండ్రి మాణిక్య శివకుమార్ ఇంటి దగ్గరకు వెళ్లి గొడవపడ్డాడు. ఆ సందర్బంలో శివకుమార్ ప్రియురాలి భర్త తంగరాజ్ మీద ఇనుపరాడ్ తో దాడి చేశాడు.

భార్య ప్రియుడిని చంపేసిన భర్త

భార్య ప్రియుడిని చంపేసిన భర్త

ఆ సందర్బంలో తంగరాజ్ ఇనుపరాడ్ లాక్కొని శివకుమార్ మీద దాడి చేశాడు. కిందపడిపోయిన భార్య పుష్పా ప్రియుడు శివకుమార్ ను కత్తితో ఇష్టం వచ్చినట్లు పొడిచిన తంగరాజ్, అతని తండ్రి మాణిక్యం అక్కడి నుంచి పరారైనారు. తీవ్రగాయాలైన శివకుమార్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స విఫలమై అతను చకిపోయాడని పోలీసులు తెలిపారు.

నా భార్యను బెదిరించాడు. అందుకే లేపేశాను

నా భార్యను బెదిరించాడు. అందుకే లేపేశాను

భార్య పుష్పా ప్రియుడు శివకుమార్ ను హత్య చేసిన తంగరాజ్, అతని తండ్రి మాణిక్యంను పోలీసులు అరెస్టు చేశారు. నా భార్య పుష్పా దూరం కావాలని అనుకున్నా శివకుమార్ ఆమెను బెదిరించి అనుభవిస్తున్నాడని, అందుకే అతన్ని చంపేశానని తంగరాజ్ చెప్పాడని పోలీసులు అన్నారు. భర్త అతని భార్య ప్రియుడిని ఇనుపరాడ్ తో కొట్టి కత్తులతో పొడిచి చంపేయడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+