jewellery: నటికి సినిమా చూపించిన శివకామి, మంచిరోజు చూసి ఛాప దిండు సర్దేసింది, గోవిందా గోవింద !
చెన్నై/మదురై: నటి ఇంట్లో కొంతకాలం నమ్మకంగా ఉంటున్న నర్సు వాళ్లను నిలువునా ముంచేసింది. వృద్దురాలు అయిన తన తల్లికి సపర్యలు చెయ్యడానికి ఆ నటి ఇంట్లో నర్సును పెట్టింది. నటి ఇంట్లో బంగారు నగలు, నగదు ఎక్కడెక్కడ ఉంటాయి అంటూ ఆ నర్సు శివకామి పసిగట్టింది. నటి ఇంట్లో లేని టైమ్ లో రాహుకాలం, దుర్ముహూర్తం, యమగండం రాని సమయంలో శివకామి నటి ఇంట్లో ఛాప, దిండు, దుప్పటి చుట్టేసి వారికి పంగనామాలు పెట్టేసి పారిపోయింది. పాపం అంతా అయిపోయిన తరువాత ఇంటికి వచ్చిన నటి గోవిందా.... గోవింద అంటూ పోలీసులను ఆశ్రయించింది.

తల్లితో నటి గాయిత్రి
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలోని రాయపేటలోని లయిడ్స్ రోడ్డులో ప్రముఖ నటి గాయిత్రి సాయినాథ్ ఆమె తల్లితో కలిసి నివాసం ఉంటున్నది. నటి గాయిత్రి తల్లి అనారోగ్యంతో ఆమె పనులు ఆమె చేసుకోలేక చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతోంది. తన తల్లికి సహాయం చెయ్యడానికి ఓ మంచి నర్సును నియమించాలని నటి గాయిత్రి కొంతకాలం క్రితం డిసైడ్ అయ్యింది.

కబాలితోట శివకామి ఎంట్రీ
చెన్నైలోని మైలాపూర్ ప్రాంతంలోని కబాలితోట ప్రాంతంలో నివాసం ఉంటున్న శివకామి నర్సుగా పని చేస్తోంది. నటి గాయిత్రి సాయినాథ్ ఇంట్లో ఆమె తల్లికి సపర్యలు చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నానని నర్సు శివకామి చెప్పింది. శివకామిని పూర్తిగా నమ్మిన నటి గాయిత్రి సాయినాథ్ ఆమెను ఇంట్లో వదిలిపెట్టంది. కొంతకాలం ఎంతో నమ్మకంగా నటిస్తూ శివకామి గాయిత్రి సాయినాథ్ కుటుంబ సభ్యులతో కలిసిపోయింది.

111 గ్రాముల బంగారం....నటికి మూడు నామాలు
ఇటీవల నటి గాయిత్రి ఇంటిలో 111 గ్రాముల బంగారు నగలు, కొంచెం డబ్బులు మాయం అయ్యాయి. తన ఇంట్లో బంగారు నగలు, నగదు చోరీ అయ్యాయని గుర్తించిన నటి గాయిత్రి రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. నటి గాయిత్రి ఇంట్లో బంగారు నగలు చోరీ చేసింది నర్సు శివకామి అని సీసీటీవీ కెమెరాల్లో రాయపేట పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రవిచంద్రన్ గుర్తించారు.
Recommended Video

రాహుకాలం, యమగండం లేని టైమ్ లో
నటి గాయిత్రి పనిపై బయటకు వెళ్లిన సమయంలో రాహుకాలం, యమగండం, దుర్ముహూర్తం లేని సమయంలో నర్సు శివకామి బీరువాలో ఉన్న 111 గ్రాముల బంగారు నగలు చోరీ చేసిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. నర్సు శివకామిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేశారు. తన అవసరాల కోసం నటి గాయిత్రీ ఇంటిలో బంగారు నగలు చోరీ చేసి వాటిని కుదవపెట్టానని నర్సు శివకామి అంగీకరించింది. బంగారు నగల కుదవ వ్యాపారి నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకుని నటి గాయిత్రికి అప్పగించామని రాయపేట పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ రవిచంద్రన్ తెలిపారు.












Click it and Unblock the Notifications