చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Khiladi lady: కిలాడీ లేడీస్, లేడీ ప్రొఫెసర్ కు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చి, ఫ్రెండ్ భర్తతో!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ టీ. నగర్: కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న మహిళ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. లేడీ ప్రొఫెసర్ ఇంట్లో ఓ మహిళ ఇంటి పని చేస్తోంది. కొన్ని సంవత్సరాల నుంచి నమ్మకంగా పని చేస్తున్న మహిళ లేడీ ప్రొఫెసర్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. ఇంటి పంని చేస్తున్న మహిళ ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. మీ ఇంటిలో పని చేసుకుంటూనే ఖాళీ సమయంలో తాను ఏదైనా వ్యాపారం చేసుకుంటానని, మీరు ఆర్థిక సహాయం చెయ్యాలని ఆమె లేడీ ప్రొఫెసర్ కు చెప్పింది.

తన దగ్గర పని చేస్తున్న మహిళకు భర్త కూడా లేడని, సహాయం చేస్తే ఆమె జీవితం బాగుపడుతుందని అనుకున్న లేడీ ప్రొఫెసర్ పనిమనిషి అడిగినంత డబ్బులు ఇచ్చింది. తరువాత చాల కథ నడిచింది. చివరికి ఇంటి పనిమనిషి లేడీ ప్రొఫెసర్ ను నమ్మించి ఇంటికి పిలిపించుకుని కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపిఇచ్చి ఆమెను నగ్నంగా తయారు చేసి ఫ్రెండ్ భర్తతో రొమాన్స్ చేపించి వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయించింది. లేడీ ప్రొఫెసర్ జీవితంతో చెలగాటం ఆడిన ముగ్గురు కిలాడీ లేడీస్ కు ఇప్పుడు సినిమా కనపడుతోంది.

Illegal affair: భర్తను చంపేసి సంచిలో ప్యాక్ చేసి ప్రియుడి ఇంట్లో పెట్టేసింది, భర్త ఎత్తులకు ఊర్మిళ పైఎత్తులు!Illegal affair: భర్తను చంపేసి సంచిలో ప్యాక్ చేసి ప్రియుడి ఇంట్లో పెట్టేసింది, భర్త ఎత్తులకు ఊర్మిళ పైఎత్తులు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం

చెన్నై సిటీలో ఆయనవరం ప్రాంతంలో నివాసం ఉంటున్న 58 ఏళ్ల మహిళ కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థలో ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్నారు. లేడీ ప్రొఫెసర్ ఆమె కుటుంబ సభ్యులతో కలిసి చెన్నైలోని ఆయనవరంలో కొన్ని సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నారు. లేడీ ప్రొఫెసర్ ఇంట్లో రాధా (40) అనే మహిళ ఇంటి పని చేస్తోంది.

భర్తను వదిలేసిన కిలాడీ లేడీ

భర్తను వదిలేసిన కిలాడీ లేడీ

కొన్ని సంవత్సరాల నుంచి నమ్మకంగా పని చేస్తున్న రాధా లేడీ ప్రొఫెసర్ దగ్గర మంచి పేరు తెచ్చుకుంది. ఇంటి పని చేస్తున్న రాధా ఆమె భర్తను గాలికి వదిలేసి అతనికి దూరంగా ఉంటోంది. మీ ఇంటిలో పని చేసుకుంటూనే ఖాళీ సమయంలో తాను ఏదైనా వ్యాపారం చేసుకుంటానని, మీరు ఆర్థిక సహాయం చెయ్యాలని పనిమనిషి రాధా ఆమె యజమాని లేడీ ప్రొఫెసర్ కు మాయమాటలు చెప్పింది.

ముచ్చటగా రూ. మూడు లక్షలు తీసుకుంది

ముచ్చటగా రూ. మూడు లక్షలు తీసుకుంది

తన దగ్గర పని చేస్తున్న రాధాకు భర్త కూడా లేడని, సహాయం చేస్తే ఆమె జీవితం బాగుపడుతుందని అనుకున్న లేడీ ప్రొఫెసర్ పనిమనిషి అడిగినంత డబ్బులు ఇచ్చింది. లేడీ ప్రొఫెసర్ దగ్గర రూ. 3 లక్షల రూపాయలు తీసుకున్న కిలాడీ లేడీ రాధా తరువాత ఆమె ఇంటిలో పని చెయ్యకుండా జెండా ఎత్తేసింది.

కోర్టుకు వెళ్లిన లేడీ ప్రొఫెసర్

కోర్టుకు వెళ్లిన లేడీ ప్రొఫెసర్

తీసుకున్న డబ్బు ఇవ్వకుండా మాయం అయిన రాధా కోసం గాలించిన లేడీ ప్రొఫెసర్ తన డబ్బలు తనకు ఇవ్వాలని మంచిగా అడిగింది. నా దగ్గర డబ్బులు లేవని, నీకు చేతనైంది చేసుకో అంటూ రాధా ఎదురుతిరిగింది. తన దగ్గర తీసుకున్న డబ్బులు ఇవ్వకుండా రాధా వేధిస్తోందని, ఆమె మీద చర్యలు తీసుకోవాలని లేడీ ప్రొఫెసర్ కోర్టును ఆశ్రయించింది.

కోర్టు నోటీసులతో రాజీకి వచ్చిన కిలాడీ లేడీ

కోర్టు నోటీసులతో రాజీకి వచ్చిన కిలాడీ లేడీ

కోర్టు విచారణకు సక్రమంగా హాజరుకాకుండా తప్పించుకుని తిరుగుతున్న ఇంటి పనిమనిషి రాధాకు కోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టు నోటీసులు జారీ చెయ్యడంతో పనిమనిషి రాధా లేడీ ప్రొఫెస్ ఇంటికి వెళ్లి నేను తీసుకున్న డబ్బు మొత్తం చెల్లిస్తానని నమ్మించింది. లేడీ ప్రొపెసర్ కు డబ్బు ఇస్తానని మాయమాటు చెప్పిన రాధా ఆమె ఇంటికి పిలిపించుకుంది.

 కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి?

కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి?

లేడీ ప్రొఫెసర్ రాధా ఇంటికి వెళ్లింది. ఆ సమయంలో జ్యూస్ లో మత్తుమందు కలిపిన రాధా ఆ కూల్ డ్రింక్ లేడీ ప్రొఫెసర్ కు ఇచ్చింది. మత్తుమందు తాగిన జ్యూస్ తాగిన లేడీ ప్రొఫెసర్ బెడ్ మీద నిద్రపోయింది. కొన్ని గంటల తరువాత లేడీ ప్రొఫెసర్ కు ఓ వీడియో చూపించిన ఇంటి పనిమనిషి రాధా ఎక్కువ మాట్లాడితే ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించింది.

ఫ్రెండ్ భర్తను రంగంలోకి దింపిన కిలాడీ లేడీస్

ఫ్రెండ్ భర్తను రంగంలోకి దింపిన కిలాడీ లేడీస్

వీడియో చూసి షాక్ అయిన లేడీ ప్రొఫెసర్ ఏం జరిగింది అంటూ ఆలోచించింది. కూల్ డ్రింక్ లో మత్తు మందుకలిపి ఇచ్చారని తెలుసుకుంది. బెడ్ మీద లేడీ ప్రొఫెసర్ తో రాధా స్నేహితురాలు లక్ష్మీ భర్త చంద్రన్ రొమాన్స్ చేస్తున్న సమయంలో రాధా వీడియో తీపించింది.

తనకు తెలీకుండా ఇంత తతంగం ఎప్పుడు జరిగింది అని హడలిపోయిన లేడీ ప్రొఫెసర్ చివరికి పోలీసులను ఆశ్రయించింది. లేడీ ప్రొఫెసర్ కు మత్తు మందు ఇచ్చి అశ్లీల వీడియో తీపించిన కేసులో ఇంటి పనిమనషి రాధాతో పాటు ఆమె స్నేహితురాళ్లు పుష్ప, లక్ష్మీ, ఆమె భర్త చంద్రన్ లను పోలీసులు అరెస్టు చేశారు.

English summary
Khiladi lady: Women arrested for cheating and blackmail video case in Chennai city in Tamil Nadu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X