Lady: భర్తను వదిలేసి ఇంట్లో ప్రియుడితో రొమాన్స్, అక్క లవర్ తల నరికిన తమ్ముడు, ఇద్దరిని వదల్లేదు!
చెన్నై: కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య తీరుతో విసిగిపోయిన భర్త ఆమెను వదిలేశాడు. భర్తను వదిలేసి ఇద్దరు పిల్లలతో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. పుట్టింటిలో ఉంటున్న మహిళకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు.
ఇద్దరు పిల్లలు ఉన్నారు అనే విషయం మరిచిపోయిన మహిళ అక్రమ సంబంధం పెట్టుకుని ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న ఆమె రొమాన్స్ చేసింది. ఆ సమయంలో ఇంటికి వెళ్లిన సోదరుడు అక్క ప్రియుడి తల నరికేశాడు. అడ్డుపడిన అక్కను కూడా అతను కత్తితో నరికేయడం కలకలం రేపింది.

భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య
చెన్నై సిటీలోని ఎర్నావూరులోని సునామీ కాలనీలో లిథిరా అనే మహిళ నివాసం ఉంటున్నది. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించిన వ్యక్తిని వివాహం చేసుకున్న లిథిరా ఆమె ఆమె భర్తతో సంతోషంగా కాపురం చేసింది. కొన్ని సంవత్సరాలు కాపురం చేసిన లిథిరా దంపతులకు ఇద్దరు పిల్లలు పుట్టారు.

భార్య దెబ్బకు పారిపోయిన భర్త
ఇద్దరు పిల్లలు పుట్టిన కొన్ని సంవత్సరాల తరువాత లిథిరా దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. పెద్దలు పంచాయితీలు చేసినా లిథిరా మాత్రం ఆమె భర్త మాట వినకుండా ఆమె తీరు మార్చుకోకుండా కాలం గడిపింది. భార్య లిథిరా తీరుతో విసిగిపోయిన భర్త ఆమెను వదిలేశాడు. భర్తను వదిలేసిన లిథిరా ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి ఎర్నావూరులోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

ప్రియుడితో ఎంజాయ్
పుట్టింటిలో ఉంటున్న లిథరాకు రాజా అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు అనే విషయం మరిచిపోయిన లిథిరా అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న రాజాతో అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో ఎంజాయ్ చేసింది. లిథిరా ఆమె ప్రియుడు రాజా నేరుగా ఇంటికి పిలిపించుకున్న ఆమె రొమాన్స్ చేసింది.

అక్క ప్రియుడి తల నరికిన తమ్ముడు
ఈ విషయం తెలుసుకున్న లిథిరా సోదరుడు మదన్ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. ఆ సందర్బంలో మదన్ అతని అక్క ప్రియుడు రాజా తల నరికేశాడు. అడ్డుపడిన అక్క లిథిరా మీద మదన్ కత్తితో నరికేయడం కలకలం రేపింది. స్థానికులు లిథిరా, ఆమె ప్రియుడు రాజాను స్టాల్లీ ఆసుపత్రికి తరలించారు. మదన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని చెన్నై సిటీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications