marriage: అబ్బా అమ్మా అనింది, మిలమిల మెరిసిన కొత్త పెళ్లికూతురు మాయం, నగలు, డబ్బు, కారు?

చెన్నై/ విల్లుపురం: ఓ మహిళ ఫేస్ బుక్ లో, సోసల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటోంది. మహిళకు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తికి ఇంకా పెళ్లికాలేదు. చాలాకాలం పాటు సోషల్ మీడియాలో టచ్ లో ఉన్న ఇద్దరూ తరువాత ఫోన్ నెంబర్లు మార్చుకుని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.

ఆ వ్యక్తి తన సోషల్ మీడియా గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంటానని అతని కుటుంబ సభ్యులను ఒప్పించాడు. బంధువుల సమక్షంలో ఇద్దరికి పెళ్లి జరిగింది. నెల రోజుల పాటు భర్తతో కాపురం చేసిన మహిళ మాయం అయ్యింది. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు బయటకు వచ్చాయి.

ఫేస్ బుక్ గర్ల్ ఫ్రెండ్

ఫేస్ బుక్ గర్ల్ ఫ్రెండ్

తమిళనాడులోని విల్లుపురం జిల్లాలోని మేల్మలయనూరు సమీపంలోని సిరుతలైపూండి గ్రామానికి చెందిన మణికందన్ వ్యవసాయం చేస్తుంటాడు. కొంతకాలం క్రితం కారైకల్ ప్రాంతానికి చెందిన మహాలక్ష్మి అలియాస్ లక్ష్మీ అనే అమ్మాయి మణికందన్ కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. కొంతకాలం మణికందన్, మహాలక్ష్మి ఫేస్ బుక్ లో, సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు.

నేను అనాథను.... ఐలవ్ యూ

నేను అనాథను.... ఐలవ్ యూ

లక్ష్మీ, మణికందన్ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. రానురానురాను మహాలక్ష్మీ అలియాస్ లక్ష్మీ, మణికందన్ చాలా చనువుగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. నేను అనాథను అని లక్ష్మీ ఆమె బాయ్ ఫ్రెండ్ మణికందన్ కు చెప్పింది. మహాలక్ష్మి, మణికందన్‌ స్నేహం తరువాత ప్రేమకు దారి తీసింది, మణికందన్, లక్ష్మీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ప్రతిరోజు ఇద్దరూ గంటలు గంటలు ఫోన్ లలో మాట్లాడుకున్నారు.

 ప్రియుడి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్

ప్రియుడి ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్

మణికందన్ అతని ప్రియురాలు లక్ష్మీ ప్రేమ గురించి అతని తల్లికి చెప్పాడు. లక్ష్మీతో పెళ్లి చేసుకోవడానికి మణికందన్ కుటుంబ సభ్యులు, బంధువులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సందర్భంలో కుటుంబ సభ్యుల అంగీకారంతో మణికందన్ కారైకల్ వెళ్లి మహాలక్ష్మిని అతని స్వగ్రామమైన సిరుతలైపూండికి తీసుకువచ్చాడు. నవంబర్ 18న అవలూరుపేట ముల్లై నగర్‌లోని అంగళమ్మ ఆలయంలో మణికందన్ అతని బంధువుల సమక్షంలో లక్ష్మీ అలియాస్ మహాలక్ష్మిని వివాహం చేసుకున్నాడు.

మేడమ్ జంప్ జిలాని

మేడమ్ జంప్ జిలాని

మణికందన్‌ అతని భార్య లక్షీతో నెల రోజులు పాటుకాపురం చేస్తూ అతని భార్యతో సంతోషగా గడిపాడు. మహాలక్ష్మి డిసెంబర్ 11న ఇంట్లోనే ఉంది. తరువాత లక్ష్మీ భర్త మణికందన్ పొలం దగ్గరకు వెళ్లాడు. కొన్ని గంటల తరువాత మణికందన్ కుటుంబ సభ్యులు వేరే ఊరిలో ఉంటున్న బంధులు ఇంటికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉన్న 8 తులాల బంగారు నగలు, రూ.1,00,000 తీసుకున్న లక్ష్మీ మణికందన్ కారుతో సహా పరారైయ్యింది.

భార్య కోసం వేతికి వెతికి?

భార్య కోసం వేతికి వెతికి?

మణికందన్ ఇంటికి వచ్చేసరికి అతని భార్య లక్ష్మి కనిపించలేదు. దాంతో మణికందన్ అతని భార్య లక్ష్మీ కోసం చాలా చోట్ల వెతికాడు. అప్పుడు కారులో వెళ్తున్న నీ భార్య లక్ష్మిని మేము చూశామని కొందరు గ్రామస్తులు మణికందన్‌కు చెప్పారు. తరువాత కొన్ని రోజుల పాటు మణికందన్ అతని భార్య లక్ష్మీ కోసం వెతికాడు. తరువాత మణికందన్ అతని భార్య మహాలక్ష్మిని ఫోన్‌లో సంప్రదించాడు. కానీ మహాలక్ష్మి మాత్రం ఫోన్ రిసీవ్ చెయ్యకుండా అతని ఫోన్స్ కు ఏమాత్రం స్పందించలేదు. కొద్దిరోజుల తర్వాత ఫోన్‌లో మాట్లాడిన మహాలక్ష్మి తాను వేరే ప్రాంతాల్లో ఉన్నానని, కొన్ని రోజులు తన గురించి వెతకడం మానేయాలని, త్వరలో నేను ఇంటికి వస్తానని భర్త మణికందన్ కు చెప్పింది.

చంపేస్తానని బెదిరించిన కిలాడీ లేడీ

చంపేస్తానని బెదిరించిన కిలాడీ లేడీ

అయితే భార్య లక్ష్మీని ఇంటికి పిలుచుకుని రావాలని మణికందన్ అతని భార్యకు పదేపదే ఫోన్లు చేశాడు. ఆ సమయంలో నువ్వు నన్ను వెతుక్కుంటూ వస్తే నిన్ను చంపేస్తానని మహాలక్ష్మి అలియాస్ లక్ష్మీ ఆమె భర్త మణికందన్ ను ఫోన్ లో బెదిరించింది. దీంతో షాక్ తిన్న మణికందన్ ఫిబ్రవరి 12వ తేదీ రాత్రి విల్లుపురం ఎస్పీ కార్యాలయంలో అతని భార్య లక్ష్మీ మీద ఫిర్యాదు చేశాడు.

కన్నింగ్ మేడమ్ ఎక్కడ

కన్నింగ్ మేడమ్ ఎక్కడ

దాని ఆధారంగా పోలీసులు కిలాడీ లేడీ మహాలక్ష్మి అలియాస్ లక్ష్మీ మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో పరిచయమై పెళ్లి అయిన నెల రోజులకే పెళ్లి చేసుకున్న ఓ యువతి ఓ బంగారు నగలు, డబ్బుతో సహా పారిపోవడం విల్లుపురం జిల్లాలో కలకలం రేపింది. కన్నింగ్ మేడమ్ ఎక్కడ ఉన్నా ఆమెను పట్టుకోవాలని పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+