Marriage: పెళ్లి పీటల మీద పెళ్లి కూతురు, పీకలదాక తాగేసి గురక పెట్టిన పెళ్లి కొడుకు, కట్ చేస్తే, గోవింద!

చెన్నై/ధర్మపురి: పెళ్లి వయసు వచ్చిన యువతికి పెళ్లి చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెళ్లి సంబంధాలు చూసి కాలం గడిపేస్తున్న కొందరు ఆమెకు ఓ యువకుడి పెళ్లి సంబంధం చూశారు. వంద అపద్దాలు చెప్పి ఓ పెళ్లి చెయ్యాలి అనే పెద్దల సామెతను ఈ పెళ్లి పెద్దలు నిజం చెయ్యాలని అనుకున్నారు. యువకుడు చాలా బుద్దిమంతుడు అని, మీ అమ్మాయిని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితాంతం సుఖంగా ఉంటుందని చెప్పారు. యువతి, యువకుడికి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేశారు. గుడిలో జరుగుతున్న పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురితో పాటు ఆమె కుటుంబ సభ్యులు వెళ్లారు.

ముహూర్తం టైమ్ దగ్గర పడినా పెళ్లి కొడుకు, అతని కుటుంబ సభ్యులు అడ్రస్ లేదు. పెళ్లి కొడుకుతో పాటు అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా వాళ్లు మాత్రం ఫోన్ కాల్ రిసీవ్ చెయ్యలేదు. పెళ్లి ముహూర్తం దాటిపోయింది. పెళ్లి కూతురితో పాటు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు ఇంటి దగ్గరకు వెళ్లారు. పీకలదాక మద్యం సేవించిన పెళ్లి కొడుకు గురకపెట్టి నిద్రపోతున్న విషయంగుర్తించిన పెళ్లి కూతురితో పాటు ఆమె కుటుంబ సభ్యులు బిత్తరపోయారు.

పెళ్లి వయసుకు వచ్చిన యువతి

పెళ్లి వయసుకు వచ్చిన యువతి

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని సెంగామకు చెందిన సెల్వి (పేరు మార్చడం జరిగింది) అనే యువతి పెళ్లి వయసుకు వచ్చింది. పెళ్లి వయసు వచ్చిన సెల్వికి వివాహం చెయ్యాలని ఆమె కుటుంబ సభ్యులు నిర్ణయించారు. పెళ్లి సంబంధాలు చూసి కాలం గడిపేస్తున్న కొందరు తమిళనాడులోని ధర్మపురి జిల్లాలోని తొట్టపడకంలోని అల్లి గ్రామంలో నివాసం ఉంటున్న శరవణన్ అనే యువకుడి పెళ్లి సంబంధం చూశారు.

పెళ్లి కొడుకు సూపర్.... డూపర్

పెళ్లి కొడుకు సూపర్.... డూపర్

శరవణన్ అనే యువకుడు చాలా బుద్దిమంతుడు అని, మీ అమ్మాయి సెల్విని అతనికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆమె జీవితాంతం సుఖంగా ఉంటుందని పెళ్లి సంబంధాలు చూసు కొందరు బ్రోకర్లు అమ్మాయి కుటుంబ సభ్యులకు చెప్పారు. శరవణన్, సెల్వికి పెళ్లి చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. పెళ్లికి సెల్వి, శవరణన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వివాహానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

గుడిలో పెళ్లి కూతురు వెయిటింగ్

గుడిలో పెళ్లి కూతురు వెయిటింగ్

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని వజ్జిరపాళ్యం గ్రామంలోని శివుడి గుడిలో శరవణన్, సెల్విల వివాహం చెయ్యాలని రెండు కుటుంబ సభ్యులు, బంధువులు నిర్ణయించారు. ఉదయం 7 గంటలకు పెళ్ల ముహూర్తం జరుగుతుండటంతో పెళ్లి కూతురు సెల్వితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ముందు రోజు రాత్రి శివాలయం దగ్గరకు చేరుకున్నారు. అయితే పెళ్లి కొడుకు శరవణన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు మాత్రం శివుడి గుడి దగ్గరకు రాలేదు.

ఫోన్లు చేసి విసిగిపోయారు

ఫోన్లు చేసి విసిగిపోయారు

ముహూర్తం టైమ్ దగ్గర పడినా పెళ్లి కొడుకు శరవణన్, అతని కుటుంబ సభ్యులు అడ్రస్ లేకపోవడంతో పెళ్లి కూతురు సెల్వితో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.పెళ్లి కొడుకు శరవణన్ తో పాటు అతని కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినా వాళ్లు మాత్రం ఫోన్ కాల్ రిసీవ్ చెయ్యలేదు. ముందుగా అనుకున్న పెళ్లి ముహూర్తం కూడా దాటిపోయింది.

ఇంట్లో గురకపెట్టి నిద్రపోతున్న పెళ్లి కొడుకు

ఇంట్లో గురకపెట్టి నిద్రపోతున్న పెళ్లి కొడుకు

పెళ్లి కూతురు సెల్వితో పాటు ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు శరవణన్ ఇంటి దగ్గరకు వెళ్లారు. పీకలదాక మద్యం సేవించిన పెళ్లి కొడుకు శరవణన్ గురకపెట్టి నిద్రపోతున్న విషయంగుర్తించిన పెళ్లి కూతురు సెల్వితో పాటు ఆమె కుటుంబ సభ్యులు అక్కడ సీన్ చూసి బిత్తరపోయారు. పెళ్లి కొడుకు శవరణన్ కుటుంబ సభ్యులు ఇంటి బయట ఏం చెయ్యాలో తెలీక నెత్తిన చేతులు పెట్టుకుని కుర్చున్నారు.

చచ్చినా తాగుబోతును పెళ్లి చేసుకోను..... అంతే

చచ్చినా తాగుబోతును పెళ్లి చేసుకోను..... అంతే

పెళ్లి చేసుకుంటున్నాననే ఆనందంతో పెళ్లి కొడుకు శవరణన్ అంతుకు ముందు రోజు రాత్రి నుంచి పీకలదాక మద్యం సేవించడంతో కథ మారిపోయిందని వెలుగు చూసింది. రెండు గంటల తరువాత కిక్కు దిగిపోవడంతో నిద్రలేచిన శరవణన్ నేను తప్పు చేశానని, ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుందామని పెళ్లి కూతురికి చెప్పాడు. అయితే తాళికట్టే సమయంలోనే పీకలదాక మద్యం సేవించిన ఇలాంటోడిని పెళ్లి చేసుకుంటే నేను అతనితో సుఖంగా కాపురం చెయ్యలేనని, ఇలాంటి తాగుబోతును నేను పెళ్లి చేసుకోనని పెళ్లి కూతురు తేల్చి చెప్పింది.

ఇప్పుడు పెళ్లి కొడుక్కి అసలు కిక్కు ఎక్కింది

ఇప్పుడు పెళ్లి కొడుక్కి అసలు కిక్కు ఎక్కింది

పెళ్లి కొడుకు శవరణన్ తో పాటు అతని కుటుంబ సభ్యులు ఎంత ప్రాదేయపడినా పెళ్లి కూతురు మాత్రం పెళ్లి చేసుకోవడానికి అంగీకరించలేదు. పెళ్లికి అయిన ఖర్చు మొత్తం పైసాలతో సహ చెల్లించాలని పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. మొత్తం మీద పెళ్లి ముహూర్తం సమయానికి పెళ్లి కొడుకు పీకలదాక మద్యం సేవించి గురకపెట్టి నిద్రపోవడం హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+