• search
 • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Sexval torcher: రాత్రి తలుపు తట్టి శివమణి టైప్ లో వాయించాడు, వేడినీళ్లు, జస్ట్ మిస్ !

|

చెన్నై/ సేలం: ఒకే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ యువకుడు అమ్మాయిపై కన్ను వేశాడు. పగటిపూట మనోడు చూడటానికి సైలెంట్ గా ఉన్నా రాత్రి అయితే ద్విపాత్రాభినం చేస్తాడు. కడుపులోకి బీర్లు గంగమ్మ లాగా గలగల పారితే అతను ఆడిందే ఆట, పాడిందే పాటగా తయారౌతుంది. పీకలదాక మద్యం సేవించడం, రాత్రిపూట అమ్మాయి ఇంటి దగ్గరకు వెళ్లి డ్రమ్ మాస్టర్ శివమణిలాగా ఆమె ఇంటి తలులుపు వాయించడంచేస్తున్నాడు. చాలాసార్లు మంచిమాటలతో చెప్పి చూసిన ఆ యువతి చివరికి సహనం కోల్పోయి రారా నువ్వేమైనా పోటుగాడివా అంటూ విశ్వరూపం చూపించడంతో మనోడికి బోబ్బలు వచ్చి ఆసుపత్రిలో ఐసీయూలో లబోదిబో అంటూ చికిత్స పొందుతున్నాడు.

Play school teacher: భర్తకు బిస్కెట్, ప్రియుడికి బత్తాయి కాయలు, లాక్ డౌన్ లో లవ్ స్టోరీ !

అమ్మా....నాన్నా.... ఓ తమిళ అమ్మాయి

అమ్మా....నాన్నా.... ఓ తమిళ అమ్మాయి

తమిళనాడులోని సేలం జిల్లా అతుక్కుప్పరం ప్రాంతం సమీపంలోని బి. నత్తమంగళం ప్రాంతంలో రాధాక్రిష్ణన్ ఆయన భార్య, కుమార్తె దేవి (24)తో (పేరు మార్చడం జరిగింది) కలిసి నివాసం ఉంటున్నాడు. రాధాక్రిష్ణన్ దంపతులు వారి పనివాళ్లు చేసుకుంటూ ఇతరుల విషయాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా కుమార్తె దేవితో కలిసి జీవిస్తున్నారు.

పగలు జనార్దనుడు.......రాత్రి నరకాసురుడు

పగలు జనార్దనుడు.......రాత్రి నరకాసురుడు

రాధాక్రిష్ణన్ కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్న ప్రాంతంలోనే జనార్దన్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రాధాక్రిష్ణన్ కుమార్తె దేవి మీద జానార్దన్ కన్ను వేశాడు. అయితే జనార్దన్ చిల్లరచేష్టలను దేవి పెద్దగా పట్టించుకునేది కాదు. పగలు శ్రీరామచంద్రుడిలాగా నటించి జనార్దన్ రాత్రి అయితే కడుపులోకి బీర్లు వెళ్లిన తరువాత పరకాయ ప్రవేశం చేసి నరకాసురుడిలా రెచ్చిపోతుంటాడు.

 డ్రమ్స్ శివమణి అవతారం

డ్రమ్స్ శివమణి అవతారం

ప్రతిరోజు రాత్రి పీకలదాక మద్యం సేవిస్తున్న జనార్దన్ నేరుగా దేవి ఇంటికి వెళ్లి డ్రమ్స్ శివమణి టైప్ లో వాళ్ల ఇంటి తలుపులు బాదుతున్నాడు. చాలా రోజులు ఓపిగా ఉన్న దేవి పగటి పూట జనార్దన్ కు చివాట్లు పెడుతూ వచ్చింది. తాగి నీపాటికి నువ్వు మీ ఇంటికి వెళ్లాలని, మా ఇంటి దగ్గరకు వచ్చి ఎందుకు తలుపులు కొడుతున్నావని మండిపడింది. అయితే తన కోరిక తీర్చాలని జనార్దన్ దేవిని అసహ్యంగా మాట్లాడటం, చిన్నచిన్న రాళ్లు తీసుకుని ఆమె మీద విసిరి రాసలీలకు రావాలని పిలవడం మొదలుపెట్టాడు.

 చన్లీళ్లు సాంపిల్....వేడినీళ్లతో వాచిపోయింది

చన్లీళ్లు సాంపిల్....వేడినీళ్లతో వాచిపోయింది

ప్రతిరోజు రాత్రిపూట ఇంటి తలుపులు కొడుతున్న జనార్దన్ కు ఎంతచెప్పినా అతని పద్దతి మాత్రం మార్చుకోలేదు. తాగుబోతు కిక్కు దిగిపోవాలని రెండుమూడు సార్లు దేవి చల్లటి నీళ్లు తీసుకువచ్చి జనార్దన్ మీద పోసింది. అయినా జనార్దర్ రోజు అర్దరాత్రిపూట దేవి ఇంటి తలుపులు తట్టుతూ ఆమెకు నరకం చూపించాడు. గత రాత్రి దేవి ఇంటికి వెళ్లిన జనార్దన్ మళ్లీ ఆమె మీద చిన్నరాళ్లు విసిరి తనతో పాటు నిర్జనప్రదేశంలోకి రావాలని పిలిచాడు. అంతవరకు ఓపికగా ఉన్న దేవి సహనం కోల్పోయి ఇంట్లోని గ్యాస్ స్టౌవ్ మీద వేడినీళ్లు కాంచి వాటిని తీసుకెళ్లి ఇంటి తలుపులు తడుతున్న జనార్దన్ మీద పొయ్యడంతో అతని శరీరం కాలిపోయి బొబ్బలు వచ్చి లబోదిబో కాపాడండి... కాపాడండి అంటూ కేకలు వేశాడు.

  Sonu Sood Has The Best Solution’ As Woman Complains About Her Husband
   పోలీసులు వార్నింగ్

  పోలీసులు వార్నింగ్

  జనార్దన్ కేకలు వేస్తున్న విషయం గుర్తించిన ఇరుగుపొరుగు వాళ్లు అతన్ని వెంటనే అంబులెన్స్ లో సేలం జిల్లా ఆసుపత్రికి తరలించారు. జనార్దన్ ముఖం, ఛాతి, శరీరంలోని ఇతర భాగాలపై వేడినీళ్లు పడటంతో తీవ్రగాయాలైనాయని కొండలంపట్టి పోలీసులు అన్నారు. రాధాక్రిష్ణన్, అతని కుమార్తె మీద కేసు నమోదు చేసిన కొండలంపట్టి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేసి తరువాత స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు. నీకు ఏదైనా సమస్య ఉంటే ముందుగా మాకు ఫిర్యాదు చెయ్యాలని, ఇలా ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదని పోలీసులు దేవిని హెచ్చరించారు. మొత్తం మీద కామంతో రలిగిపోయిన జనార్దన్ నేడు శరీరం కాలిపోయి ఐసీయూలో కష్టాలుపడుతూ దేవుడా అంటూ చికిత్స పొందుతున్నాడని స్థానిక కొండలంపట్టి పోలీసులు తెలిపారు.

  English summary
  Sexval torcher: Woman throws hot water to drunkan man for torturing at night near Salem in Tamil Nadu.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X