Superstar: హీరో పోస్టర్ల కలకలం, ఏంది స్వామి కథ, ఎవరు వాళ్లు ?, ఇప్పుడే ఎందుకు ?
చెన్నై/టీ.నగర్: రాజకీయాల్లోకి వస్తానని కొన్ని ఏళ్ల నుంచి అందరినీ ఊరించిన సూపర్ స్టార్ చివరికి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు. నేను రాజకీయాల్లోకి రాను.... ఇంతకాలం అభిమానులకు ఆశపెట్టి ఇప్పుడు నిరాశ పరిచినందుకు క్షమించండి, నాకు ఆరోగ్యం సహకరించడం లేదు అంటూ సూపర్ స్టార్ సింపుల్ గా ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బాబా సినిమాలో హిమాలయాలకు వెళ్లే ముందు ఆయన నటించిన కొన్ని సీన్ల ఫోటోలు, ఇటీవల తాను రాజకీయాల్లో కచ్చితంగా వస్తానని ప్రసింగించిన ఫోటోలతో కొన్ని పోస్టర్లు దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. సూపర్ స్టార్ రజనీకాంత్ పోస్టర్ల వెనుక ఏమి మర్మమం ఉంది ? అని అంతుచిక్కకపోవడంతో అభిమానుల్లో మళ్లీ టెన్షన్ మొదలైయ్యింది. పోస్టర్లలోని కథ ఏమిటి ?, ఇప్పుడే ఇలాంటి పోస్టర్లు ఎందుకు అంటూ అందరూ తల గీక్కుంటున్నారు.

అన్నా నగర్ లో ఏం జరిగిందంటే ?
చెన్నై సిటీ సెంటర్ పాయింట్ లోని అన్నా నగర్ లో సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోటోలతో ముద్రించిన పోస్టర్లు కలకలంరేపాయి. గొడల మీద దర్శనం ఇచ్చిన పోస్టర్లలో రజనీకాంత్ కు చెందిన కొన్ని డిఫరెంట్ ఫోటోలు ఉన్నాయి. ఆ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వాటిని చూసిన రజనీకాంత్ అభిమానులు, ప్రజల్లో గందరగోళం మొదలైయ్యింది.

ఇలాంటి టైమ్ లో అలాంటి పోస్టర్లు
రజనీకాంత్ నటించిన బాబా సినిమాకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. బాబా సినిమాలో అన్నీ కాదనుకున్న రజనీకాంత్ హిమాలయాలకు వెళ్లిపోయి ధ్యానం చెయ్యాలని డిసైడ్ అయ్యే సీన్లు ఆయన అభిమానులకు ఇప్పటి ఏప్పటికీ గుర్తు ఉంటాయి. తాను రాజకీయాల్లోకి కచ్చితంగా వస్తానని, నా అభిమానులకు గుడ్ న్యూస్ చెబుతున్నానని ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పినప్పుడు తీసిన ఫోటోలు ఈ పోస్టర్లలో దర్శనం ఇస్తున్నాయి.

హీరో కమల్ హాసన్
చెన్నైలో దర్శనం ఇచ్చిన పోస్టర్లలో కొన్ని వ్యాఖ్యాలు ముద్రించారు. దేవుడా, నువ్వు నా స్నేహితులను రక్షించు, మా శత్రువుల గురించి నేను చూసుకుంటాను అంటూ రజనీకాంత్ దేవుడిని వేడుకుంటున్నట్లు ఆ పోస్టర్లు ముద్రించడం కలకలం రేపింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని ఓ పక్క రజనీకాంత్ ఫ్రెండ్, సాటి హీరో కమల్ హాసన్ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

రజనీకాంత్ క్లోజ్ ఫ్రెండ్ కొత్త పార్టీ
ఇదే సమయంలో, మరోపక్క రజనీకాంత్ కు ఇంత కాలం పక్కనే ఉంటూ సలహాలు ఇచ్చి ఇప్పుడు కొత్తగా పార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి సూపర్ స్టార్ క్లోజ్ ఫ్రెండ్ అర్జునమూర్తి ప్రయత్నిస్తున్న సమయంలో ఇలాంటి పోస్టర్లు చెన్నైలోని అన్నా నగర్ లో, సోషల్ మీడియాలో దర్శనం ఇవ్వడం రాజకీయంగా కలకలం రేపింది.

శత్రువులు ఎవరు ? మిత్రులు ఎవరు
రజనీకాంత్ ఫోటోలతో ఏర్పాటు చేసిన పోస్టర్లు ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యింది. రజనీకాంత్ డిఫరెంట్ ఫోటోలతో ముద్రించిన ఫోటోల్లో ఆయన శత్రువులు, మిత్రుల గురించి మాట్లాడినట్లు కొన్ని వ్యాఖ్యలు ఉండటంతో ఆయన ఫ్యాన్స్ అయోమయానికి గురౌతున్నారు. అసలు రజనీకాంత్ మిత్రులు ఎవరు ?, శత్రువులు ఎవరు ? అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

గోడ కింద వ్యాపారి ఎవరు ?
రజనీకాంత్ ఫోటోలతో దర్శనం ఇచ్చిన పోస్టర్లలో ఓ గోడకింద కుర్చున్న వ్యక్తి వ్యాపారం చేసినట్లు ఉంది. ఆ గోడ కింద కుర్చున్న వ్యక్తి ఏదో మాట్లాడుతూ వ్యాపారం చేస్తున్నట్లు ఉంది. అయితే గోడ కింద కుర్చున్న వ్యక్తి ఎవరు ?, ఆ వ్యాపారి పేరు ఏమిటి ? అనే విషయం మాత్రం అంతు చిక్కకపోవడంతో రజనీకాంత్ ఫ్యాన్స్ అయోమయానికి గురౌతున్నారు.

సార్ చెబితే ఓకే....లేదంటే పోస్టర్లు !
మొత్తం మీద తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చినట్లు వచ్చి తెరమరుగు అయిన రజనీకాంత్ ఫోటోలతో ముద్రించిన పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్లు విషయంలో క్లారిటీ రావాలంటే మొదట సూపర్ స్టార్ రజనీకాంత్ అయినా నోరు విప్పాలని, లేదంటే ఆ పోస్టర్లు ముద్రించిన వ్యక్తులు అయినా మాట్లాడలని, లేదంటే క్లారిటీ రాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications