చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Techie 420: అపార్ట్ మెంట్ లో భార్య, కస్టమ్స్ అధికారి పేరుతో ఏం చేశాడంటే ?, క్లైమాక్స్ లో రివర్స్!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ కోయంబత్తూర్: ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వివాహం చేసుకున్నాడు. భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న టెక్కీ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. లక్షల్లో ఆ టెక్కీ జీతం తీసుకుంటున్నాడు. ఇటీవల ఓ మహిళ వివాహం చేసుకోవాలని ప్రముఖ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకుంది. మ్యాట్రీమోనీ వివరాల ఆధారంగా ఆ మహిళను ఓ వ్యక్తిని సంప్రదించాడు. తరువాత చాల కథ జరిగింది. కొంతకాలం పాటు ఇద్దరు ఫోన్ లో టచ్ లో ఉన్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి కోసం పట్టువస్త్రాలు కొనుగోలు చేశారు. పెళ్లి ముహూర్తం రెండు రోజులు ఉండగా కథ మొత్తం రివర్స్ అయ్యింది.

Manager: భార్య అకౌంట్ కు Rs. కోట్లు బదిలి చేసి బ్యాంక్ అధికారి ఎస్కేప్, అనంతపురం నుంచి ఎగేసుకుని వెళ్లి !Manager: భార్య అకౌంట్ కు Rs. కోట్లు బదిలి చేసి బ్యాంక్ అధికారి ఎస్కేప్, అనంతపురం నుంచి ఎగేసుకుని వెళ్లి !

సాఫ్ట్ వేర్ ఇంజనీర్

సాఫ్ట్ వేర్ ఇంజనీర్

తమిళనాడులోని కోయంబత్తూర్ లోని వీరపాండి ప్రాంతంలో రాము (38) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న రాము వివాహం చేసుకున్నాడు. భార్య, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్న టెక్కీ రాము ఉద్యోగానికి వెళ్లి వస్తున్నాడు. టెక్కీ రాము ప్రతినెల లక్షల్లో జీతం తీసుకుంటున్నాడు.

కస్టమ్స్ అధికారి పెళ్లి కోసం?

కస్టమ్స్ అధికారి పెళ్లి కోసం?

ఇటీవల 26 ఏళ్ల యువతి వివాహం చేసుకోవాలని ప్రముఖ మ్యాట్రీమోనీ వెబ్ సైట్ ద్వారా వివరాలు నమోదు చేసుకుంది. మ్యాట్రీమోనీ వివరాల ఆధారంగా ఆ యువతిని తాను కస్టమ్స్ అధికారి అంటూ రాము సంప్రదించాడు. తనకు వివాహం అయ్యిందని, పిల్లలు లేరని, కుటుంబ సమస్యల కారణంగా తన భార్యతో తాను విడిపోయానని రాము ఆ యువతికి చెప్పాడు.

కస్టమ్స్ అధికారుల యూనీఫామ్ లో?

కస్టమ్స్ అధికారుల యూనీఫామ్ లో?

సాఫ్ట్ వేర్ ఇంజనీరు అయిన రాము కస్టమ్స్ అధికారులు వేసుకునే యూనీఫామ్ వేసుకుని ఫోటోలు తీసుకుని అప్పటికే ఆ యువతికి పంపించాడు. కస్టమ్స్ అధికారుల యూనీఫామ్ వేసుకున్న రామును ఆ యువతి నిజంగానే కస్టమ్స్ అధికారి అని నమ్మింది. ఇదే సమయంలో వివాహం జరిగిన ఆరు నెలలకే తాను భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని ఆ యువతి రాముకు చెప్పింది.

పెళ్లి ముహూర్తం ఫిక్స్

పెళ్లి ముహూర్తం ఫిక్స్

నువ్వు నీ భర్తను వదిలేశావు, నేనే నా భార్యకు దూరంగా ఉంటున్నాను, మనం పెళ్లి చేసుకుందామని టెక్కీ రాము ఆ యువతికి మాయమాటలు చెప్పాడు. అప్పటి నుంచి కొంతకాలం పాటు రాము, ఆ యువతి ఫోన్ లో టచ్ లో ఉన్నారు. తరువాత నేరుగా కలుసుకుంటున్నారు. పెళ్లికి రాము ఆ యువతితో డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.

క్లైమాక్స్ లో సీన్ రివర్స్

క్లైమాక్స్ లో సీన్ రివర్స్

రాము, ఆ యువతి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పెళ్లి కోసం ఓ షోరూమ్ కు వెళ్లి ముహూర్తానికి మాత్రమే రూ. 50 వేలు ఇచ్చి పట్టువస్త్రాలు కొనుగోలు చేశారు. అదే రోజుల రాము టైమ్ బాగాలేకపోవడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది. రాము ఇంకా అతని భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడని తెలుసుకున్న యువతి షాక్ అయ్యింది.

420 కస్టమ్స్ అధికారి అరెస్టు

420 కస్టమ్స్ అధికారి అరెస్టు

అదే రోజు రాత్రి రాముకు తెలీకుండా ఆ యువతి అతన్ని ఫాలో చేసింది. నేరుగా ఇంటికి వెళ్లిన రాము ఆ రోజు అక్కడే నిద్రపోయాడు. అర్దరాత్రి దాటిన తరువాత పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో నకిలి కస్టమ్స్ అధికారి రామును పోలీసులు అరెస్టు చేశారు. భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నకిలి కస్టమ్స్ అధికారి గెటప్ లో ఓ యువతిని వివాహం చేసుకోవడానికి సిద్దం అయ్యి అరెస్టు కావడం కలకలం రేపింది.

English summary
Techie 420: Married man pretends to be customs officer tries to cheat a young woman in Coimbatore city in Tamil Nadu
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X