girlfriend: ప్రేమికుల రోజు ఎంతపని జరిగింది ?, గర్ల్ ఫ్రెండ్ కోసం మేకతో జంప్, ఇంజనీరింగ్ స్టూడెంట్ కథ!

ప్రేమికుల రోజు ప్రియురాలికి గిఫ్ట్ ఇవ్వడానికి చేతిలో డబ్బులు లేకపోవడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి భలే స్కెచ్ వేశాడు. ప్రియుడు రాసిన స్టోరీ ఓ మేక కథ.... ఇట్లు నేను, నా ప్రియురాలు, ఓ ఫ్రెండ్ అంతే. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఈ రోజు

చెన్నై/కాంచీపురం: ప్రేమికుల రోజు అంటే లవర్స్ కు ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన పుట్టిన రోజు, తల్లిదండ్రుల పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, తోడపుట్టిన వాళ్ల పుట్టిన రోజులు మరిచిపోయినా ప్రేమికుల రోజు మరీ గుర్తు పెట్టుకుని ప్రియురాలితో ఫిబ్రవరి 14వ తేదీన గ్రాండ్ గా వాలైంటైన్స్ డేని చాలా గ్రాండ్ గా చేసుకుంటారు. అలాంటి ప్రేమికులు మన భారతదేశంలో, మన రాష్ట్రంలో, మన ఊరిలో, అంత ఎందుకు మన చుట్టుపక్కలే చాలా మంది ఉంటారు.

అయితే ప్రేమికుల రోజు ప్రియురాలికి గిఫ్ట్ ఇవ్వడానికి చేతిలో డబ్బుులు లేకపోవడంతో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి భలే స్కెచ్ వేశాడు. ప్రియురాలి గిఫ్ట్ పుణ్యమా అంటూ ప్రియుడు స్నేహితుడికి చుక్కలు కనిపించాయి. ప్రియుడు రాసిన స్టోరీ ఓ మేక కథ.... ఇట్లు నేను, నా ప్రియురాలు, ఓ ఫ్రెండ్. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కావలసిన యువకుడు ఈ రోజు ?.

మేకల ఫామ్ ఓనర్

మేకల ఫామ్ ఓనర్

తమిళనాడులోని చెన్నై సమీపంలోని కాంచీపురం సమీపంలోని మలైయరసన్ కుప్పం ప్రాంతంలో రేణుకా అనే మహిళ నివాసం ఉంటున్నది. రేణుకాకు వందల సంఖ్యలో మేకలు, గొర్రెలు ఉన్నాయి, మేకల వ్యాపారం చేస్తున్న రేణుకా దంపతులు ఇంటి సమీపంలోనే పెద్ద షేడ్ ఏర్పాటు చేశారు. అదే షెడ్ లో రేణుకా ఆమె మేకలు గొర్రెలు పెట్టి వాటిని సాకుతూ తరువాత వాటిని విక్రయిస్తోంది.

మేడమ్ మేకల మీద కన్ను

మేడమ్ మేకల మీద కన్ను

రేణుకా పెంచుతున్న మేకల భద్రత కోసం ఓ వ్యక్తి రోజు అర్దరాత్రి వరకు కాపలా ఉంటున్నాడు. అయితే అర్దరాత్రి దాటిన తరువాత ఇద్దరు యువకులు పల్సర్ బైక్ లో వెళ్లి ఓ మేకను ఎత్తుకుని అదే బైక్ లో అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అయితే మేకను ఎత్తుకోవడంతో సాటి మేకలతో పాటు చోరీకి గురైక మేక కూడా మ్యామ్యామ్యా అంటూ సౌండ్ చేశాయి. మేకలు సౌండ్ చెయ్యడంతో రేణుకా కుటుంబ సభ్యులు నిద్రలేచి ఇంటి నుంచి బయటకు వచ్చారు.

ప్రియురాలి కోసం దొంగ అయిన ఇంజనీరింగ్ విద్యార్థి

ప్రియురాలి కోసం దొంగ అయిన ఇంజనీరింగ్ విద్యార్థి

బైక్ లో మేకను ఇద్దరు యువకులు ఎత్తుకుని వెళ్లిపోతున్న విషయం గమనించిన రేణుకా గట్టిగా దొంగ దొంగ అంటూ కేకలు వేసింది. గ్రామస్తులు నిద్రలేచి బైక్ లో వెలుతున్న యువకులను పట్టుకున్నారు. మేకను దొంగిలించిన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి అరవింద్ కుమార్ (20), అతని స్నేహితుడు మోహన్ (20)లను పట్టుకున్న గ్రామస్తులు వారిని కాంచీపురం పోలీస్ స్టేషన్ లో అప్పగించారు. పోలీసులు యువకుడిని విచారించారు.

ప్రేమికుల రోజు వచ్చి వీళ్ల జీవితంలో ఎంతపని చేసింది?

ప్రేమికుల రోజు వచ్చి వీళ్ల జీవితంలో ఎంతపని చేసింది?

అందులో కాలేజీ విద్యార్థి అరవింద్ ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తన ప్రియురాలికి గిఫ్ట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో రేణుకా ఇంటిలో మేకను దొంగిలించానని చెప్పడంతో పోలీసులు హడలిపోయారు. దీంతో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పల్సర్ బైక్ స్వాధీనం చేసుకున్నారు.

అలాగే కందాచీపురం ప్రాంతాల్లో మేకల దొంగతనానికి సంబంధించి ఈ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని కాంచీపురం పోలీసులు తెలిపారు. చాలా కాలంగా కాంచీపురం జిల్లాలో ప్రతినిత్యం మేకలు, గొర్రెలు చోరీ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+