Wife: సిటీలోనే ఫేమస్ రౌడీషీటర్, పేరు చెబితే హడల్, భార్య కోసం ప్రాణత్యాగం, అదే రోజు సేమ్ సీన్ రిపిట్!
చెన్నై/ టీ. నగర్: ఓ యువకుడు ఆ ప్రాంతంలో యువకులను వెంటవేసుకుని రౌడీగా తయారైనాడు. రానురాను హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, లూటీలు చేసి రౌడీషీటర్ల జాబితాలో చేరిపోయాడు. రౌడీషీటర్ ఓ యువతిని వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేశాడు. భార్యతో కాపురం చేస్తున్న రౌడీషీటర్ అతని నేరాలు, అక్రమ కార్యకలాపాలు మాత్రం ఆపలేదు.
రౌడీషీటర్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్తతో రోజు గొడవలు జరగడం, అతని అరాచకాలు తట్టుకోలేని భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకోవడంతో షాక్ అయిన రౌడీషీటర్ ఆమెను తలచుకుంటూ స్నేహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భార్య ప్రథమ వర్దంతి రోజు రౌడీషీటర్ కూడా సజీవదహనం కావడం కలకలం రేపింది.

చెన్నైలో ఫైమస్ రౌడీషీటర్
చెన్నై సిటీలోని చూలైమేడులోని రాజా పురాణికల్ వీధిలో ప్రశాంత్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల క్రితం నుంచి ఎలాంటి పనిపాట చెయ్యకుండా తిరుగుతున్న ప్రశాంత్ ఉద్దరగా డబ్బులు సంపాధించాలని ఆలోచించాడు. ఆ ప్రాంతంలో యువకులను వెంటవేసుకుని తిరిగిన ప్రశాంత్ రౌడీగా తయారైనాడు.

పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు
రానురాను హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, లూటీలు చేసిన ప్రశాంత్ చెన్నై సిటీలో రౌడీషీటర్ల జాబితాలో చేరిపోయాడు. చెన్నైలో ప్రశాంత్ ఫేమస్ రౌడీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రౌడీషీటర్ గా ముద్ర వేసుకున్న ప్రశాంత్ సెల్వీ అనే యువతిని వివాహం చేసుకుని ఆమెతో కాపురం చేశాడు. కొన్ని సంవత్సరాల పాటు భార్య సెల్వీతో రౌడీషీటర్ ప్రశాంత్ చక్కగా, సంతోషంగా కాపురం చేశాడు.

ఆత్మహత్య చేసుకున్న భార్య
భార్యతో కాపురం చేస్తున్న రౌడీషీటర్ ప్రశాంత్ అతని నేరాలు, అక్రమ కార్యకలాపాలు మాత్రం ఆపలేదు. ప్రశాంత్ మీద ఇప్పటికే హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీల కేసుల విచారణ పెండింగ్ లో ఉన్నాయి. రౌడీషీటర్ ప్రశాంత్, సెల్వీ దంపతుల మద్య రానురాను గొడవలు మొదలైనాయి. భర్త ప్రశాంత్ తో రోజూ గొడవలు జరగడం, అతని అరాచకాలు తట్టుకోలేని అతని భార్య సెల్వి గత ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది.

భార్య ప్రథమ వర్దంతి రోజు ఫేమస్ రౌడీ ఆత్మహత్య
భార్య ఆత్మహత్య చేసుకోవడంతో షాక్ అయిన రౌడీషీటర్ ప్రశాంత్ ఆమెను తలచుకుంటూ స్నేహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నా భార్య లేనిలోటు తనకు ఎవ్వరు తీర్చలేరని ప్రశాంత్ పదేపదే అతని స్నేహితుల దగ్గర వాపోయాడని అతని స్నేహితులు అంటున్నారు. ఇంటి దగ్గర భార్య ప్రథమ వర్దంతి చేసిన ప్రశాంత్ దిగులుగా కనిపించాడు .భార్య ప్రథమ వర్దంతి రోజు రౌడీషీటర్ ప్రశాంత్ కూడా నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.












Click it and Unblock the Notifications