Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Wife: భార్య గొంతు చీల్చి చంపిన భర్త, అదే కత్తితో ?, సీక్రెట్ గా రెండో పెళ్లి, భార్య పుట్టింటిలో రెచ్చిపోయి !

చెన్నై: వివాహం చేసుకున్న యువతితో చక్కగా సంసారం చేస్తున్నట్లు నటించిన యువకుడు ఆమెను గర్బవతిని చేశాడు. సమయం ఉన్నప్పుడు తన భర్త తనను బయటకు పిలుచుకుని వెలుతున్నాడని, బిజీగా ఉన్న సమయంలో కుదరలేదని బయటకు పిలుచుకుని వెళ్లడం లేదని భార్య అనుకుంది. భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య ఓ బిడ్డకు తల్లికి అయ్యింది. కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన భార్య కొన్ని నెలలు అక్కడే ఉండిపోయింది. 9 నెలల బిడ్డను పిలుచుకుని ఇంటికి వెళ్లిన భార్యకు షాకింగ్ విషయం తెలిసింది. తన కంటే ముందే తన భర్త వేరే మహిళను వివాహం చేసుకున్నాడని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుసుకున్న అతని రెండో భార్య రగిలిపోయింది. భర్త మీద గొడవపడిన రెండో భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయి ఆమె బతుకు ఆమె బతుకుతోంది. రెండో భార్య మీద మోజు దగ్గకపోవడంతో ఆమె పుట్టింటి దగ్గరకు వెళ్లి గొడవ పెట్టున్నాడు. అక్కడ మాటా మాటా పెరిగిపోయింది. నీకు విడాకులు ఇచ్చేస్తానని, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని భార్య చెప్పింది. ఆ సమయంలో రెచ్చిపోయిన భర్త కత్తి తీసుకుని భార్య గొంతు చీల్చి దారుణంగా హత్య చేసి అక్కడ నానా హంగామా చేసి అతను ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది.

భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య

భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య

చెన్నైలోని వలజాబాద్ లో నివాసం ఉంటున్న బాల మురుగన్ (27) అనే యువకుడు తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలోని శివగిరిలో నివాసం ఉంటున్న అనూ (21) అనే యువతిని వివాహం చేసుకున్నాడు. అనూతో చక్కగా సంసారం చేస్తున్నట్లు నటించిన బాల మురుగన్ ఆమెను గర్బవతిని చేశాడు. సమయం ఉన్నప్పుడు తన భర్త బాల మురుగన్ తనను బయటకు పిలుచుకుని వెలుతున్నాడని, బిజీగా ఉన్న సమయంలో కుదరలేదని బయటకు పిలుచుకుని వెళ్లడం లేదని అతని భార్య అనూ అనుకుంది.

కాన్ఫు కోసం వెళ్లిన భార్య

కాన్ఫు కోసం వెళ్లిన భార్య

భర్త బాల మురుగన్ తో సంతోషంగా కాపురం చేసిన అనూ ఓ పాపకు తల్లికి అయ్యింది. గత ఏడాది కాన్పు కోసం శివగిరిలోని పుట్టింటికి వెళ్లిన అనూ కొంతకాలం అక్కడే ఉండిపోయింది. చెన్నై నుంచి శివగంగై వెళ్లి వస్తున్న బాల మురుగన్ భార్య అనూతో బాగా ఉన్నట్లు నటించాడు. 9 నెలల తరువాత కూతురిని ఎత్తుకుని చెన్నైలోని ఇంటికి వెళ్లిన అనూకు షాకింగ్ విషయం తెలిసింది.

భార్యకు షాక్ ఇచ్చిన స్థానికులు

భార్యకు షాక్ ఇచ్చిన స్థానికులు

ఇంటికి వెళ్లిన అనూకు స్థానికులు షాక్ ఇచ్చారు. నీ భర్త బాల మురుగన్ నీకంటే ముందుగానే వేరే యువతిని వివాహం చేసుకున్నాడని, అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారు వేరే ప్రాంతంలో నివాసం ఉంటున్నారని, మరో మహిళతో బాల మురుగన్ కు అక్రమ సంబంధం ఉందని చుట్టుపక్కల వాళ్లు అనూకు చెప్పారు. నీకు ఇంతకు ముందే వివాహం జరిగి ఉంటే మళ్లీ నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటూ అనూ ఆమె భర్త బాల మురుగన్ తో గొడవ పెట్టుకుంది.

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

భర్త బాల మురుగన్ మీద గొడవపడిన అతని రెండో భార్య అనూ శివగిరిలోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయి ఆమె బతుకు ఆమె బతుకుతోంది. రెండో భార్య అనూ మీద మోజు దగ్గకపోవడంతో ఆమె పుట్టింటి దగ్గరకు వెళ్లిన బాల మురుగన్ గొడవ పెట్టున్నాడు. తనతో రావాలని, నీకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని బాల మురుగన్ చెప్పాడు. ఆ సమయంలో బాల మురుగన్, అనూల మద్య మాటా మాటా పెరిగిపోయింది.

మొదటి భార్యకు విడాకులు ఇస్తానని చెప్పిన భర్త

మొదటి భార్యకు విడాకులు ఇస్తానని చెప్పిన భర్త

బాల మురుగన్, అనూకు సర్ది చెప్పడానికి స్థానికులు, బంధువులు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే అనూ మాత్రం ఎవ్వరు చెప్పినా మాట వినలేదు. ఇంతకు ముందే వివాహం చేసుకుని పిల్లలు ఉన్నా ఇప్పుడు తనను వివాహం చేసుకున్నాడని. తన జీవితంతో పాటు మొదటి భార్య జీవితాన్ని బాల మురుగన్ నాశనం చేశాడని అనూ పెద్ద గొడవ చేసింది. మొదటి భార్యకు విడాకులు ఇచ్చి నీతోనే కలిసి ఉంటానని బాల మురుగన్ అతని భార్య అనూకు నచ్చ చెప్పడానికి అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు.

భార్య గొంతు చీల్చి చంపిన భర్త

భార్య గొంతు చీల్చి చంపిన భర్త

నువ్వు నాకు విడాకులు ఇవ్వడం కాదు, నేనే నీకు విడాకులు ఇచ్చేస్తానని, వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని అనూ కోపంలో ఆమె భర్త బాల మురుగన్ కు చెప్పింది. ఆ సమయంలో రెచ్చిపోయిన బాల మురుగన్ కత్తి తీసుకుని భార్య అనూ గొంతు చీల్చి దారుణంగా హత్య చేశాడు. అడ్డు వచ్చిన వారి మీద బాల మురుగన్ దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. అనూ ఇంటి దగ్గర నానా హంగామా చేసిన బాల మురుగన్ అదే కత్తితో కోసుకుని అతను ఆత్మహత్యాయత్నం చెయ్యడం కలకలం రేపింది.

ఆసుపత్రిలో కేటుగాడు

ఆసుపత్రిలో కేటుగాడు

కత్తితో పొడుచుకోవడంతో తీవ్రగాయాలైన బాల మురుగన్ ను ఆసుపత్రికి తరలించారు. అనూ హత్యకు గురి కావడం, తండ్రి జైలుపాలు కావడంతో వారి 9 నెలల పాప ఇప్పుడు అనాథ అయ్యింది. ఆసుపత్రిలో బాల మురుగన్ కోలుకున్న తరువాత అతన్ని అరెస్టు చేస్తామని కేసు విచారణలో ఉందని పోలీసులు అన్నారు. అయితే బాల మురుగన్ మొదటి భార్య, అతని పిల్లల కోసం ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+