CTET January 2024: రిజిస్ట్రేష‌న్లు ప్రారంభం..అప్లయ్ చేసుకోండి..

ఉపాధ్యాయవృత్తిలో స్థిర‌ప‌డాల‌నుకునే అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్‌ ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) నిర్వహిస్తుంది. ఈ ప‌రీక్షను ప్ర‌తిఏటా సిబిఎఇ రెండుసార్లు నిర్వ‌హిస్తుంది. ఇప్ప‌డు తాజాగా జనవరి-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సీటెట్ 2024 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్‌ 3 నుంచి ప్రారంభమ‌వుతుంది. నవంబర్‌ 23 వరకు అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునే వీలుంటుంది. సీటెట్ 2024 పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించడం జ‌రుగుతుంది.

పరీక్ష విధానం :సీటెట్‌ పరీక్ష మొత్తం రెండు పేపర్‌లలో ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి, ఇక రెండో పేపర్ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం ఉంటుంది. సీటెట్ స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ పరీక్షను 20 లాంగ్వేజ్‌ల‌లో నిర్వహిస్తారు. ఈ సీటెట్ ప‌రీక్ష స్కోర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని ఏ పాఠ‌శాల‌లోనైనా ఉపాధ్యాయ నియామకాలకు ఉప‌యోగ‌పడే అవ‌కాశం ఉంది.

CTET January 2024 Registrations Begin..Apply..

అర్హ‌త‌లు...:పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్‌ఈడీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ)/ బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) లేదా సీనియర్‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (బీఈఎల్‌ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్/ ఓబీసీ అభ్య‌ర్థుల‌కు 1000 రూపాయ‌లు (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రెండు పేప‌ర్ల‌కు అయితే, రూ.1200, ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: ఒక్క పేప‌ర్‌కు 500 రూపాయ‌లు చెల్లించాల్సి ఉంటుంది. రెండు పేప‌ర్ల‌కు అయితే 600 రూపాయ‌లు చెల్లించాలి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌ నగరాల్లో ఈ పరీక్షను నిర్వహించనున్నారు

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: నవంబర్‌ 03, 2023
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్‌ 23, 2023
ఫీజు చెల్లించడానికి చివరి తేది: నవంబర్‌ 23, 2023
కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: జనవరి 21, 2024
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ : https://ctet.nic.in/

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+