'కథలు' చెప్పేందుకు వెళ్లి దారుణాలు.. ఐదుగురు మహిళలపై అత్యాచారం,హత్య... జీవిత ఖైదు విధించిన కోర్టు
అతని పేరు సలాది లక్ష్మీనారాయణ... గ్రామాల్లో కనకదుర్గమ్మ కథలు చెబుతూ జీవనం సాగిస్తుంటాడు... అయితే అతనిలో కనిపించని మరో కోణం కూడా ఉంది... అమాయక మహిళలను లోబర్చుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడేవాడు... ఆపై కిరాతకంగా హతమార్చేవాడు... ఇలా ఒకరు కాదు,ఇద్దరు కాదు ఐదుగురు మహిళలను హతమార్చాడు... చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న అతన్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఓ మహిళ హత్య కేసులో తాజాగా కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది.

అసలేం జరిగింది...
తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం కేదారిలంక సలాది లక్ష్మీనారాయణ స్వగ్రామం. ఇదే గ్రామంలో నివసిస్తూ చుట్టుపక్కల గ్రామాల్లో వెంకన్న బాబు,కనకదుర్గమ్మ కథలు చెబుతుండేవాడు. ఎవరు కథ చెప్పమని పిలిస్తే ఆ గ్రామానికి వెళ్లేవాడు. అలా వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తుండేవాడు. అయితే ఆ డబ్బులు చాలకపోవడంతో అడ్డదారులు తొక్కాడు. తాను కథలు చెప్పడానికి వెళ్లే గ్రామాల్లో అమాయక మహిళలను తన మాయ మాటలతో ఆకట్టుకునేవాడు. భక్తి,ఆధ్యాత్మిక ముసుగులో వారిని తన దారికి తెచ్చుకునేవాడు.

లైంగిక దాడులు,హత్యలు...
తన మాటలకు ఆకర్షితులైన మహిళలను వెంట తీసుకెళ్లేవాడు. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు. ఆపై ఆ మహిళలను కిరాతకగా హతమార్చి... వారి ఒంటిపై బంగారాన్ని దోచుకునేవాడు. మృతదేహాలను ఇసుక తిన్నెల్లో పూడ్చి పెట్టి పారిపోయేవాడు. అలా ఐదుగురి మహిళలను హత్య చేశాడు. గతంలో ఓ హత్య కేసులో పట్టుబడినప్పటికీ పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. ఇటీవలే పోలీసులకు మళ్లీ చిక్కాడు. దీంతో పాత కేసుల్లో అతన్ని కోర్టు ఎదుట హాజరుపరుస్తున్నారు.

నిందితుడికి జీవిత ఖైదు...
లక్ష్మీ నారాయణ హత్యలను పరిశీలిస్తే... 2012లో కొవ్వూరు మండలంలోని మద్దూరి లంకకు చెందిన ఆకుల నాగమణిని హత్య చేశాడు. 2014లో యానాంకు చెందిన సత్యవతిని,2014లో దంగేరుకు చెందిన ఓ వివాహితను,2015లో మలికిపురం మండలం కేశనపల్లికి చెందిన సత్యవతి,2017లో మామిడి కుదురుకు చెందిన భాగ్యవతిలను హత్య చేశాడు. నగరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన భాగ్యవతి హత్య కేసులో లక్ష్మీనారాయణకు తాజాగా అమలాపురం కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పుపై బాధితురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. మిగతా కేసుల్లోనూ నిందితుడికి శిక్ష విధించాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
-
ఈ రాశి వారికి ఆస్తి తగాదాలు తప్పవు..!! -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
కుప్పకూలిన Gold ETF.. 18 ఏళ్లలో అతిపెద్ద పతనం.. -
తన భార్య గురించి విజయ్ సంచలన కామెంట్స్. 30 ఏళ్లు ఎదురుచూసి! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
Humsafar Express: శ్రీకాకుళం-తిరుపతి కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-ఆ రోజు నుంచే..! -
సెకెనుకు 40,000 కి. మీ వేగంతో.. భూమి వైపు -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
ఏపీలో ఈ నియోజకవర్గాలు ఇక మహిళలకే, సీనియర్లు.. మంత్రుల స్థానాలు ఔట్..!! -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
అది ఇస్త్రీ కొట్టా ? సాఫ్ట్ వేర్ కంపెనీనా ?? .. అకౌంట్ లో రూ.598 కోట్లు !! -
టోల్ కక్కండి- రేట్ ఖరార్ చేసిన ఇరాన్












Click it and Unblock the Notifications