బ్యూటీపార్లర్ ముసుగులో వ్యభిచారం.. కాకినాడలో, ఐదుగురి అరెస్ట్
ఈ మధ్య సెక్స్ రాకెట్లు ఎక్కువగానే వెలుగుచూస్తున్నాయి. మెట్రో నగరాలు/ సిటీలలో అయితే.. సరే అనుకోవచ్చు. చిన్న పట్టణాలకు కూడా అదీ పాకింది. బ్యూటీ పార్లర్ ముసుగులో ఎంచక్కా దందా చేస్తున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో సెక్స్ రాకెట్ వెలుగుచూసింది. సమాచారంతో పోలీసులు రైడ్ నిర్వహించగా.. ఐదుగురు పట్టుబడ్డారు.

పైకి బ్యూటీ పార్లర్
బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను కాకినాడ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సిధ్దార్ధ నగర్ సెంటర్‌లో మేఘన ఫ్యామిలి బ్యూటీ సెలూన్ పేరుతో సుధారాణి అనే మహిళ పార్లర్ నిర్వహిస్తోంది. రెండు నెలల క్రితం ఆమె ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు యజమానులు చెప్పారు. కానీ దాని మాటున వ్యభిచారం చేస్తోంది.

ఇద్దరు యువతులు
బ్యూటీ పార్లర్‌లో పని చేసేందుకు ఇద్దరు యువతులను నియమించుకుంది. ఫోన్ ద్వారా విటులను రప్పించి, తన వద్ద ఉన్న యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం సేకరించిన పోలీసులు ఆ ఇంటిపై నిఘా పెట్టి గురువారం దాడి చేశారు. దీంతో వారు దొరికిపోయారు. పట్టుబడ్డకా కళ్లబొల్లి కబుర్లు చెప్పే ప్రయత్నం చేశారు.

నిర్వాహకురాలు సహా
ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకురాలు సుధారాణితోపాటు మరో ముగ్గురు యువకులను, ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 4 సెల్ ఫోన్లు , రూ.2,250 నగదు స్వాధీనం చేసుకున్నారు. వ్యభిచారం చేస్తున్న బాధిత యువతులు ఇద్దరినీ స్త్రీ సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్న పట్టణాల్లో కూడా వ్యభిచార దందా జరగడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్న.. రైడ్స్ నిర్వహిస్తున్న ముఠా ఏర్పాటు మాత్రం ఆగడం లేదు. మన సంస్కృతి, సాంప్రదాయానికి యావత్ ప్రపంచం ప్రణమిల్లుతోంది. కానీ ఇలాంటి ఘటనల వల్ల ఆ పేరుకు మచ్చ ఏర్పడనుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications