Onion Benefits: ఉల్లిపాయ తీసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..
దాదాపు అందరు ఉల్లిపాయ వాడుతుంటారు. ముఖ్యం మాంసాహారంలో ఎక్కువ ఉల్లి వాడతారు. ఉల్లిపాయతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనట్లు.. ఉల్లిగడ్డతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లి తీసుంటే
జుట్టు రాలిపోకుండా రక్షణ కలిగిస్తుందట. ఉల్లిపాయలో ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, సోడియం వంటి పోషకాలు ఉంటాయట. ఉల్లిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి అధిక పరిమాణంలో ఉంటాయి. అవి శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందట.

కొలెస్ట్రాల్
ఉల్లిపాయ రసంలో కొలెస్ట్రాల్ పరిమాణం చాలా పరిమితంగా ఉంటుందట. ముఖ్యంగా జీర్ణక్రియ మెరుగుపరచడానికి ఉల్లి సహాయపడుతుంది. ఉల్లిపాయ రసంలో క్వెర్సెటిన్ అనే ఫ్లేవనాయిడ్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయట. ఉల్లిపాయ రసంలో ఇన్యులిన్ సమ్మేళనాలు పెద్ద పరిమాణంలో ఉంటాయట.

నోటి దుర్వాసన
ఉల్లిపాయతో నోటి దుర్వాసన కారణం అవుతుంది. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల నోరు తాత్కాలిక దుర్వాసన వస్తుంది. దీనిని వైద్యపరంగా హాలిటోసిస్ అంటారు. ముఖ్యంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నవారు వీటిని తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చి ఉల్లిపాయలో రక్తంలో చక్కెర పరిమాణాలను పెంచుతుందట. కావున డయాబెటిక్ పేషెంట్లు వీటిని తినకుండా ఉంటే మంచిదట.

కన్నీళ్లు
ఉల్లిపాయను కోసేటప్పుడు కళ్లలో నీళ్లు వస్తాయి. కట్ చేస్తే అందులో ఉన్న సల్ఫర్ మెటాబోలైట్ ఒక రూపం లాక్రిమేటరీ ఫ్యాక్టర్ విడుదల అవుతుంది. ఇది మీ కళ్ళకు చేరినప్పుడు కన్నీళ్లు వస్తాయి.












Click it and Unblock the Notifications