రిటైర్మెంట్ తర్వాత నివసించటానికి ఇండియాలోని 6 అందమైన ప్రదేశాలివే!!
ఉరుకులు పరుగుల జీవితంలో ఉద్యోగాల వెనుక పరుగెత్తి అలసిపోయి రిటైర్మెంట్ తర్వాత హాయిగా రెస్ట్ తీసుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. అటువంటి వారు పదవీ విరమణ తర్వాత ఎక్కడ సెటిల్ అవ్వాలి? ఎక్కడైతే సుఖంగా జీవించవచ్చు? ఎక్కడ వాతావరణం హాయిగా ఉంటుంది? అనేక అంశాలపైన దృష్టి పెడతారు. ఇక అటువంటి వారి కోసమే ఈ కథనం. భారతదేశంలో రిటైర్మెంట్ తర్వాత హాయిగా జీవించగలిగే 6 ప్రదేశాలు మనం తెలుసుకుందాం.
రిటైర్మెంట్ తర్వాత హాయిగా జీవించే ప్రదేశాలలో ఇండియాలో మొట్టమొదటి చెప్పుకోదగినది గోవా. గోవా లో వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అందమైన బీచ్ లు, ప్రశాంతమైన జీవనశైలి, మంచి సంస్కృతికి ప్రసిద్ధి చెందినటువంటి గోవా రిటైర్మెంట్ తర్వాత జీవించడానికి అనుకూలమైన ప్రదేశం.
గోవా తర్వాత, రిటైర్మెంట్ తర్వాత జీవించడానికి అనుకూలంగా ఉండే మరొక ప్రదేశం కొచ్చి. కేరళలో ఉన్న తీర నగరం కొచ్చి చాలా సుందరంగా ఉంటుంది. ఇక్కడ బ్యాక్ వాటర్స్, చారిత్రాత్మక ప్రదేశాలు మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. సౌకర్యవంతమైన, ప్రశాంతమైన జీవనశైలి, ఆహ్లాదకరమైన వాతావరణం కట్టిపడేస్తాయి. కనుక పదవీ విరమణ తర్వాత ఎవరైనా కొచ్చిలో జీవించడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు.

తమిళనాడులో ఉన్న కోయంబత్తూరు కూడా చాలా అందమైన ప్రాంతం. కోయంబత్తూర్ లోనూ రిటైర్మెంట్ తర్వాత జీవించటానికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కోయంబత్తూరు మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. ఇక్కడ మంచి ఆరోగ్య సంరక్షణకు అవకాశం ఉంటుంది. కోయంబత్తూర్ లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
రిటైర్మెంట్ తర్వాత జీవించడానికి అనుకూలంగా ఉండే మరొక అందమైన ప్రాంతం మైసూర్. మైసూర్ లో గొప్ప వారసత్వ సంపద, ఉద్యానవనాలు, అందమైన రాజభవనాలు మనసును కట్టిపడేస్తాయి. నిర్మలమైన వాతావరణం, అక్కడి ప్రజల చక్కని జీవన విధానం మైసూర్ లో జీవించటానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.
పదవీ విరమణ తరువాత జీవించటానికి అనుకూలంగా ఉండే మరొక అందమైన ప్రాంతం మహారాష్ట్రలో ఉన్న పూణే. పూణే ఎప్పుడు సర్వాంగ సుందరంగా ఉంటుంది. పూణే చాలా శక్తివంతమైన నగరం. అద్భుతమైన విద్యాసంస్థలు, అనేక రకాల వినోద కార్యక్రమాలతో జీవించటానికి అనుకూలంగా ఉండే వాతావరణం. భారతదేశంలోని ఇతర ప్రధాన నగరాలతో పోలిస్తే పూణేలో ప్రశాంతమైన జీవనం సాగించటానికి అవకాశం ఉంటుంది.
పదవీ విరమణ తర్వాత ఇండియాలో సెటిల్ అవ్వటానికి డెహ్రాడూన్ కూడా అనుకూలంగా ఉంటుంది. హిమాలయాలకు దిగువన ఉన్న డెహ్రాడూన్ సహజ అందం, ఆహ్లాదకరమైన వాతావరణంతో ఆకట్టుకుంటుంది. ప్రశాంతమైన వాతావరణానికి డెహ్రడూన్ ప్రసిద్ధి చెందింది.ఇక్కడ కూడా రిటైర్మెంట్ తర్వాత హాయిగా జీవించొచ్చు.












Click it and Unblock the Notifications
