పెళ్ళిళ్ళలో ఈ తప్పులు చేస్తున్నారా? అయితే ఇలాంటి నష్టాలు తప్పవు!!
ఇటీవలి కాలంలో చాలా మంది పెళ్లిళ్లను శాస్త్రోక్తంగా నిర్వహించడం లేదు. ముహూర్తానికి కనీసం జీలకర్ర, బెల్లం కూడా పెట్టని ఎన్నో వివాహాలను మనం నిత్యం చూస్తున్నాం. పెళ్లి వేడుకలో ఫోటోలు, వీడియోల హడావిడి తప్ప పెళ్లి కనిపించటం లేదన్న అసహనం కూడా వచ్చిన బంధువులలో వ్యక్తం అవుతుంది. అయితే ఇది ఏమాత్రం మంచిది కాదని హిందూ ధర్మం తెలిసిన పెద్దలు చెబుతున్నారు.
పెళ్లిళ్లలో చేస్తున్న పొరపాట్ల వల్ల అనేక కష్టనష్టాలను చవిచూడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పెళ్లిళ్లలో ముహూర్తానికి ప్రాధాన్యత ఇవ్వకపోతే దానివల్ల నష్టం వాటిల్లుతుందని, భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదని, భార్య భర్తలకు మంచి సంతానం కలగదని చెబుతున్నారు. జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వధూవరులు ఒకరి కళ్లలోకి ఒకరు చూపులను నిలుపుకోకపోతే వారిద్దరి మధ్య ప్రేమ లోపిస్తుందని చెబుతున్నారు.

ఇక పెళ్ళి తంతు జరుగుతున్నప్పుడు, శాస్త్రోక్తంగా చేసే పెళ్లి పైన కాకుండా ఫోటోలు, వీడియోలపైన శ్రద్ధ పెడితే వారి జీవితంలో సంస్కారం లోపిస్తుంది అని చెబుతున్నారు.పెళ్లిలో తలంబ్రాలు పోసుకోవడం ఆనవాయితీ. ఇటీవల కాలంలో తలంబ్రాల స్థానంలో మెరుపులు, ధర్మకోల్ బాల్స్, రంగు రంగుల పూసలు పోసుకోవడం చూస్తున్నాం. ఈ విధంగా పోసుకోవడం వల్ల బంధు ద్వేషం కలుగుతుందని, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని చెపుతున్నారు.
ఇక కల్యాణమండపంలోని వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చే బంధువులు చెప్పులు వేసుకుని మండపం లోకి రావడం వల్ల, మండపం లో ఉండే దేవతలు వెళ్లిపోతారని, ఫలితంగా జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇక వేదమంత్రాలు మైకుల్లో వినపడకుండా సినిమా పాటలు పెట్టడం కూడా దైవ కటాక్షాన్ని దూరం చేస్తుందని చెబుతున్నారు.

బఫే భోజనాలు పెట్టడం వల్ల అన్న దానం చేసిన ఫలితం ఉండదని సూచిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు తీసుకొని జ్ఞాపకంగా ఉంచుకోవడం లో తప్పులేదు కానీ, శాస్త్రీయంగా జరగాల్సిన పెళ్లి తంతును ఫోటోలు, వీడియోలు కోసం సరిగ్గా నిర్వహించకపోతే కష్టనష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం హిందూ ధర్మ శాస్త్రాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications