Tulasi Benefits: మీ ఇంట్లో తులసి ఉందా.. అయితే మీకు మెడిసిన్స్ అవసరం తక్కువే..!
తులసి చెట్టును హిందువులు పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ తులసికి పవిత్రతోపాటు అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. దీని శాస్త్రీయ నామం ఓసిమం టెన్యూఫ్లోరం. తులసిలో రెండు జాతులున్నాయి. ముదురు రంగులో ఉండే జాతిని కృష్ణ తులసి అనీ, కొంచెం లేత రంగులో ఉండేదానిని రామతులసి అని అంటారు. తులసి ఆకు, తులసి నీరుతో అనే లాభాలు ఉన్నాయట.

దగ్గు, జలుబు
తులసిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందడమే కాకుండా జీర్ణ సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ తులసి నీటిని రోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయట. తులసి ఆకులను రోజూ తింటే శరీరం శుభ్రంగా ఉంటుంది. అలాగే తులసి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.

ఆయుర్వేదం
అందుకే తులసి ఆకుల రసం ఆయుర్వేదంలోనూ, ఇంటి వైద్యం చిట్కాలలోనూ విస్తృతంగా వాడుతుంటారు. తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసిని వాడుతారు. శరీరంలో కొవ్వు పదార్థాలు పేరుకుపోకుండా తులసి అడ్డుకుంటుందట.

రోగనిరోధక శక్తి
చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుందట.తులసి ఆకులు, పసుపు పొడితో నీటిని మరిగించి, వర్షాకాలంలో తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది రోజూ ఖాళీ కడుపుతో తులసిని తీసుకోవడం వల్ల కడుపు నొప్పి ఉపశమనం లభిస్తుంది.

మధుమేహం
మధుమేహ వ్యాధిగ్రస్తులకు తులసి నీరు చాలా మంచిది. ఎందుకంటే తులసి నీటిని తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రోజూ తులసి నీటిని తాగడం వల్ల శరీరంలోని మూలల్లోని టాక్సిన్స్ బయటకు వెళ్లి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుందట. మీరు మీ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలంటే, తులసి నీరు మీకు చాలా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
-
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..! -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..!











Click it and Unblock the Notifications