ఇంట్లో బల్లులు పోవాలంటే ఇలా చెయ్యండి!!
చాలామంది ఇళ్లల్లో బల్లుల బెడదతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంట్లో బల్లుల బెడద ఎక్కువగా ఉన్నవారు వాటిని బయటకు తరమడానికి పడరాని పాట్లు పడుతూ ఉంటారు. కిచెన్లో బల్లులు ఉంటే ఇంట్లో ఆడవాళ్లకు వంట చేస్తున్నా, ఏ పని చేస్తున్నా ఒకటే టెన్షన్. పొరపాటున బల్లి ఎందులోనైనా పడితే పెను ప్రమాదమే ముంచుకొస్తుంది.
బల్లులు ఇళ్ళల్లో లేకుండా చేయడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల స్ప్రేలను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ అది పెద్దగా ప్రభావం చూపించడం లేదని బాధపడుతున్న వారు కూడా లేకపోలేదు. ఇక అలాంటి వారికోసం ఇంట్లో బల్లులు లేకుండా చేయడానికి ఏం చేయాలి అన్న దాన్ని గురించి ఇక్కడ తెలుసుకుందాం.

బల్లులు తిరిగే ప్రదేశాలలో నాఫ్తలీన్ గోలీలు, లేదా నాఫ్తలీన్ పౌడర్ వేస్తే బల్లి ఆ వాసనకు పారిపోతుందని చెబుతున్నారు. అంతే కాదు గది యొక్క వెంటిలేటర్లు, కిటికీల మూలల్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉంచితే కూడా బల్లులు లేకుండా పోతాయని చెబుతున్నారు.వారానికి రెండు సార్లు వెల్లుల్లి రెబ్బలను మార్చుకోవాలని, వెల్లుల్లి వాసన ఎక్కువగా వస్తే బల్లులు త్వరగా అక్కడినుంచి వెళ్లిపోతాయని చెబుతున్నారు.
ఇక బల్లులు తిరిగే ప్రదేశాలలో కోడి గుడ్డు పెంకులను ఉంచితే కూడా అక్కడ నుండి బల్లులు వెళ్లిపోతాయని చెబుతున్నారు. అంతేకాదు నల్ల మిరియాలు, ఎండుమిర్చి పొడిని మూడు నుండి నాలుగు కప్పుల నీటిలో గంటసేపు నానబెట్టి ఆ తర్వాత ఆ కారం నీళ్లను లేదా కారాన్ని గది చుట్టూ, గది గోడలపై చల్లితే బల్లులు అక్కడి నుంచి వెళ్లిపోతాయని చెబుతున్నారు.
కొంచెం కాఫీని, పొగాకుతో కలిపి చిన్న చిన్న బాల్స్ గా చేసి ఇంటి మూలల్లో ఉంచితే బల్లుల బెడద తగ్గుతుందని చెబుతున్నారు. ఉల్లిపాయ ఘాటైన వాసనను బల్లులు తట్టుకోలేవని, బల్లులు ఉండే ప్రదేశాలలో ఉల్లిపాయ ముక్కలను ఉంచినా బల్లులు అక్కడి నుంచి వెళ్లిపోతాయని చెబుతున్నారు. కాబట్టి ఈ చిట్కాలు ట్రై చేసి బల్లులకు చెక్ పెట్టండి. ఇంట్లో బల్లుల దండయాత్రను ఆపండి.












Click it and Unblock the Notifications