Valentines day 2024: నేటినుండి వాలంటైన్స్ వీక్ షురూ... ప్రేమికులకు వారమంతా స్పెషల్!!
ఫిబ్రవరి మాసం నడుస్తోంది. ఫిబ్రవరి మాసానికి ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఈ మాసాన్ని ప్రేమకు ప్రతీకగా భావిస్తారు. ఫిబ్రవరి నెలలోనే 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులంతా ఈ నెలలో సంబరాలు చేసుకుంటారు. ఇక ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకోవడానికి ముందు వారమంతా సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఈ సెలబ్రేషన్స్ నేటి నుంచి ప్రారంభమవుతాయి.
నేటి నుండి ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం వరకు (valentines day) ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క రోజును ఒక్కొక్క విధంగా జరుపుకుంటారు. వాలెంటెన్స్ వీక్ లో బహుమతులు, సంతోషాన్ని కలిగించే అనేక విషయాలు, ప్రేమను పంచుకునే జ్ఞాపకాలు మరెన్నో ప్రేమికులకు మధురానుభూతిని కలిగిస్తాయి. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఏడు రోజుల వాలెంటెన్స్ వీక్ సంబరాలు విషయానికి వస్తే..

ఫిబ్రవరి 7వ తేదీని రోజ్ డే గా జరుపుకుంటారు . ఈరోజు ప్రియమైన వారికి గులాబీని ఇస్తారు. ఫిబ్రవరి 8వ తేదీని ప్రపోజ్ డే గా జరుపుకుంటారు. తమ ప్రేమను ప్రపోజ్ చేస్తారు. ఫిబ్రవరి 9వ తేదీని చాక్లెట్ డే గా జరుపుకుంటారు. ఈరోజు చాక్లెట్లతో పాటు వారికి ఇష్టమైన బహుమతులను ఇస్తారు. ఫిబ్రవరి 10వ తేదీన టెడ్డీ డే గా జరుపుకుంటారు.
ఫిబ్రవరి 11వ తేదీన ప్రామిస్ డే గా జరుపుకుంటారు. ఈరోజు ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తూ ప్రామిస్ చేస్తారు. ఫిబ్రవరి 12వ తేదీన హగ్ డేగా జరుపుకుంటారు. ఈరోజు ప్రియమైన వారిని ఆలింగనం చేసుకొని ప్రేమను వ్యక్తం చేస్తారు. ఫిబ్రవరి 13వ తేదీన కిస్ డే గా జరుపుకుంటారు. తమకు ఇష్టమైన వారికి ముద్దు ఇచ్చి ప్రేమను స్పష్టం చేస్తారు.
ఇక ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే గా ప్రేమికుల దినోత్సవంగా ప్రేమికులు సంబరాలు చేసుకుంటారు. వారం రోజులపాటు ఈ వాలెంటైన్స్ వీక్ ప్రేమకు ప్రాధాన్యతనిస్తూ కొనసాగుతుంది. ప్రతీ ఏడూ ప్రపంచ వ్యాప్తంగా వాలంటైన్స్ డే సంబరాలు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూడా నేటి నుండి సంబరాలు ప్రారంభం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications