కోడెల పేరుతో చంద్రబాబు శవ రాజకీయాలు : డిప్యూటీ సీఎం సుచరిత
అమరావతి/ నరసారావుపేట : మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేరుతో శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు ఏపీ డిప్యూటీ సీఎం సుచరిత. బతికున్నప్పుడు కోడెలను పట్టించుకోని చంద్రబాబు .. కోడెల చనిపోయాక మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. కోడెల మాజీ స్పీకర్ అయినందునే ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేస్తామని ప్రకటించామని ... దానిని కుటుంబసభ్యులు తీసుకోకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. కోడెల మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని తెలిపారు.
కోడెల చనిపోయాక రకరకాలుగా వార్తలొచ్చాయని గుర్తుచేశారు డిప్యూటీ సీఎం సుచరిత. తొలుత గుండెపోటు అని తర్వాత అధిక మోతాదులో ఇంజక్షన్ తీసుకొని చనిపోయారని ప్రచారం జరిగిందని వివరించారు. కోడెల మృతిపై తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు బృందంతో విచారణ జరిపిస్తోందని పేర్కొన్నారు. ఈ అంశం విచారణ పరిధిలో ఉందని .. దాని గురించి ఇప్పుడే మాట్లాడబోనని పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నోరు తేరిస్తే చాలు అబద్దాలు వల్లెవేస్తున్నారని విమర్శించారు. కోడెలపై ఏపీ ప్రభుత్వం కేసు పెట్టలేదని .. బాధితుల ఫిర్యాదు మేరకు కోడెల కూతురు, కుమారుడిపై కేసులు నమోదయ్యాయని క్లారిటీ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి వచ్చిన మెజార్టీ చూసి తట్టుకోలేకపోతున్నారని .. రాక్షసుల మధ్య కూర్చొలేకపోతున్నామని చంద్రబాబు అనడం ఆయన వైఖరికి అద్దం పడుతుందన్నారు.

చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా మాట్లాడటం లేదన్నారు. అధికారం లేకుండా ఉండలేరని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా కాదు .. సీఎంగా ఉన్నప్పుడు జగన్‌పై విమర్శలు చేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వం సీబీఐని రాష్ట్రంలో అడుగుపెట్టనీయమని చెప్పిన చంద్రబాబు .. ఇప్పుడు కోడల ఆత్మహత్య గురించి సీబీఐ విచారణ అడగడం విడ్డూరంగా ఉందన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications