పోలీసు కాదు మృగాడు..?, బాధితురాలిపైనే లైంగికదాడి, ఎస్పీకి ఫిర్యాదుచేసిన యువతి..
ఇష్టమని చెప్పి, ప్రేమ అని నమ్మించాడు. నువ్వు లేకపోతే నేను లేను అని డైలాగ్స్ చెప్పాడు. ఆ పని అయిపోయాక ప్రేమ లేదు గీమ లేదు అని తేల్చేశాడు. పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే దూరంగా ఉంటూ వస్తూన్నాడు. అదీకాక స్నేహితులతోపాటు యువతిని ఇబ్బందులకు గురిచేశారు. లాభం లేదనుకొని పోలీసులను ఆశ్రయించినా ఆ యువతికి చుక్కెదురైంది. ఆ ఎస్సై కూడా యువతిపై లైంగికదాడి చేయడంతో.. తన గోడును ఎవరికీ చెప్పుకోవాలని అంటోంది. ఎస్సై చర్యను జిల్లా పోలీసు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

ప్రేమ పేరుతో..
గుంటూరులోని శారదకాలనీలో ఓ యువతి కుటుంబం ఉంటోంది. సమీపంలో ఉండే డేవిడ్ అనే దుర్మార్గుడు యువతిని లైన్‌లో పెట్టాడు. ప్రేమ అని చెప్పి నమ్మించాడు. ఆమె వెంట పడటంతో నిజమేనని అనుకొంది. ఎలాగూ పెళ్లి కూడా చేసుకుంటామని భావించి.. వారిద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. ఇంకేముంది మోజు తీరాక డేవిడ్ ప్లేట్ ఫిరాయించాడు. క్రమంగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులు రేవంత్, రామారావుతో వేధించడం ప్రారంభించాడు.

పేరెంట్స్ దృష్టికి..
డేవిడ్ తీరును యువతి అతని తల్లిదండ్రులతో చెప్పింది. తొలుత వారు పెళ్లికి ఓకే అని.. కానీ మూడేళ్లు పడుతోందని చెప్పారు. తర్వాత మాట మార్చి.. మతం పేరు తెరపైకి తీసుకొచ్చారు. డేవిడ్ మోసం చేశాడని ఆ యువతి కుమిలిపోయింది. కానీ అతని స్నేహితుల నుంచి వేధింపులు మాత్రం తగ్గడం లేదు. దీంతో యువతి అరండల్ పేట పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన సీఐ.. కేసును ఎస్సై బాలకృష్ణకు అప్పగించారు. కానీ ఎస్సై తీరు కూడా సరిగా లేదు. సాయం కోసం వచ్చిన యువతిపైనే కన్నేశాడు.

డిసెంబర్ 31న..
విచారణ పేరుతో యువతి ఇంటికి రావడం ప్రారంభించాడు. అలా డిసెంబర్ 31వ తేదీన సాయంత్రం లైంగికదాడి కూడా చేశాడని యువతి చెబుతోంది. విషయం ఎవరికైనా చెబితే అంతుచూస్తానని బెదిరించాడని పేర్కొన్నది. ఎస్సై కూడా లైంగికదాడి చేశాడని జిల్లా ఎస్పీని బాధిత యువతి ఆశ్రయించారు. కేసును ఎస్పీ సీరియస్‌గా తీసుకున్నారు. ఎస్సై వ్యవహారశైలిపై విచారణకు ఆదేశించారు. విచారణ ఆధారంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. బాధితురాలి ఆరోపణలపై ఎంక్వైరీ జరుపుతున్నామని.. యువతిపై ఎస్సై లైంగికదాడి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications