గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరు MP ఎవరో ఎవరికీ తెలియదు?

|
Google Oneindia TeluguNews

రాష్ట్రంలో 25 లోక్ సభ నియోజకవర్గాలున్నప్పటికీ అందులో గుంటూరుది ప్రత్యేకమైన స్థానం. రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాతోపాటు రాజధాని పరిధిలో ఉండటంతో ఈ సీటు కోసం రాజకీయ పార్టీల్లో ఎక్కువ డిమాండ్ ఉండే నియోజకవర్గంగా నిలుస్తుంటుంది. ఎంపీ అభ్యర్థి ఆర్థిక బలం, అంగ బలం ఉన్నవాడైతే ఇక్కడ విజయం సాధించడం సులువు. ఎన్నికల సమయంలో అన్ని పార్టీలు బలమైన అభ్యర్థుల కోసమే ప్రయత్నిస్తుంటాయి.

యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ!

యువతకు ఉపాధి కల్పిస్తానని హామీ!

ప్రస్తుతం గుంటూరు లోక్ సభ నుంచి ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున గల్లా జయదేవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కార్యాలయం గుంటూరు నగరంలో ఉంటుంది. జయదేవ్ చిత్తూరు జిల్లాలో ఉన్న అమరరాజా కంపెనీలోకానీ, సింగపూర్ లోకానీ ఉంటూ వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. 2014 ఎన్నికలకు ముందు గుంటూరు నలువైపులా కంపెనీలను ఏర్పాటుచేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఎలక్షన్ మేనేజ్ మెంట్, పోల్ మేనేజ్ మెంట్ సరిగ్గా చేసుకోవడంతో ఆయన విజయం సాధించారు.

 అప్పుడప్పుడు అందుబాటులోకి..!

అప్పుడప్పుడు అందుబాటులోకి..!


జయదేవ్ మొదటిసారి ఎంపీ అయినప్పుడు రాష్ట్రంలో టీడీపీనే అధికారంలో ఉంది. కేంద్రంలో కూడా ఎన్టీయే ప్రభుత్వం ఉంది. ఆయన చిత్తశుద్ధి చూపితే వివిధ రంగాల్లో సంస్థలను ఏర్పాటు చేయడానికి ఎన్నో అవకాశాలుండేవి. అప్పుడప్పుడు మాత్రమే అందుబాటులోకి వస్తారంటూ ఆయనపై సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే రోజులు గడిచిపోయాయి. 2019 ఎన్నికలొచ్చాయి. అప్పుడు కూడా ఆయనే పోటీచేసి విజయం సాధించారు. మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి.

చంద్రగిరి నుంచి పోటీ?

చంద్రగిరి నుంచి పోటీ?


2014-19 మధ్య అందుబాటులో ఉన్నన్ని రోజుల్లో కనీసం సగం రోజులు కూడా ఆయన గుంటూరు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అందుబాటులో లేరు. రాష్ట్రంలో వైసీపీ విజయం సాధించడంతోపాటు, టీడీపీ విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం ఎంపీ స్థానాలనే గెలుచుకోగలిగింది. అనంతర పరిణామాల్లో అమరరాజా కంపెనీ వాతావరణ కాలుష్యానికి కారణమవుతోందంటూ ప్రభుత్వం నోటీసులివ్వడంలాంటి పరిణామాలు జరిగాయి. వాస్తవానికి ఎక్కువ మంది ప్రజలకు గుంటూరులో ఎంపీ కార్యాలయం ఎక్కడుందో తెలియదంటే అతిశయోక్తి కాదు. జయదేవ్ తల్లి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజకీయాల నుంచి విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన రానున్న ఎన్నికల్లో సొంత నియోజకవర్గం చంద్రగిరి నుంచి అసెంబ్లీకి పోటీచేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. చెప్పుకోదగిన సంఖ్యలో కూడా గుంటూరుకు అవసరమైనవాటిని ఎంపీ తేలేకపోయారనే అసంతృప్తి ఇక్కడి ప్రజల్లో ఉంది. ఈసారి ఎంపీగా ఎవరు పోటీచేసినా, ఎవరు విజయం సాధించినా అభివృద్ధి చేస్తే చాలు అంటున్నారు ఇక్కడి ప్రజలు.

English summary
Galla Jayadev is currently representing Telugu Desam Party as an MP from Guntur Lok Sabha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X