పల్నాటి పులి కోడెల, భయం అంటే ఏంటో తెలియదు, మృతిని జీర్ణించుకోలేమన్న చంద్రబాబు
హైదరాబాద్ : నవ్యాంధ్రప్రదేశ్ తొలి స్పీకర్, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన ఇంటిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కోడెల శివప్రసాద్ రాజకీయ జీవితం తెరిచిన పుస్తకం. ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేసి మన్ననలు పొందారు. ఏపీ తొలి స్పీకర్‌గా పనిచేశారు. ఆయన మృతి తెలుగుదేశం పార్టీకి తీరనిలోటు. టీడీపీ నేతలు, శ్రేణులు, కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.
కోడెల శివప్రసాద్‌కు భయం అంటే ఏంటో తెలియదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పులిలా బతికారని .. ఫైర్ బ్రాండ్ అని చెప్పారు. కోడెల శివప్రసాద్ మృతితో గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. కోడెల శివప్రసాద్ మృతిని జీర్ణించుకోలేక పోనిదని చంద్రబాబు అన్నారు. అతని ఆత్మహత్య గురించి తలచుకుంటేనే బాధ కలుగుతుంది. విరోచితంగా పోరాడాడు .. కానీ మానసిక, శారీరక వేధింపులు ఎక్కువయ్యాయని పేర్కొన్నారు. కోడెల శివప్రసాద్ పల్నాడు పులి అని పేర్కొన్నారు.

టీడీపీ కోసం రేయింబవళ్లు శ్రమించారు. సంక్షోభాలకు ఎదుర్కొన్న కోడెల .. అవమానాన్ని మాత్రం భరించలేకపోయాడని పేర్కొన్నారు చంద్రబాబు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులు మంచిది కాదన్నారు చంద్రబాబు. సీనియర్ నేత మృతి తమను తీవ్రంగా కలచివేస్తోందని తెలిపారు. ఓ వైద్యుడు ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోవడాన్ని తట్టుకోలేకపోతున్నామని చెప్పారు. ఒక డాక్టర్ మానసిక క్షోభకు గురై, అవమానానికి గురై తప్ప ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని తెలిపారు. కోడెల మృతికి కారణమెవరో తెలుసుకోవాలని కోరారు చంద్రబాబు నాయుడు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications