Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ పై లోకేష్ సెటైర్ ... ఇంట్లో పబ్జీ .. అసెంబ్లీలో లాలీజో అంటూ నిద్ర

ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో హాయిగా నిద్ర పోతున్నారు అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా జగన్ నిద్రపోతున్న వీడియోను పోస్ట్ చేశారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీఎం జగన్ ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిద్రపోతూ కనిపించిన దృశ్యాలను ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేసి ఆయన పంచుకున్నారు. సీఎం జగన్ కు అసెంబ్లీలో నిద్రపోవడం అలవాటు అన్న అర్థం వచ్చేలా ఆయన పోస్ట్ చేశారు. గత సమావేశాల్లోనూ ఇలాగే నిద్రపోయాడని, ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నాడనే అర్థం వచ్చేలా 'జగన్ అనే నేను అసెంబ్లీలో...' అనే శీర్షికతో వీడియో షేర్ చేశారు.

Lokesh Satires on Jagan ... Pubg at home .. sleeping in assembly

"ఇంట్లో పబ్జీ... అసెంబ్లీలో లాలిజో" అంటూ లోకేష్ సీఎం జగన్మోహన్ రెడ్డి పై సెటైర్ వేశారు. ఇంట్లో పబ్జీ ఆడుకుంటారు. ఇక అసెంబ్లీకి వచ్చి నిద్ర పోతారు అని ఆయన పంచ్ వేశారు .ఇక అంతే కాదు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏడాది విధ్వంసం పాలనపై నిరసన తెలిపామని పేర్కొన్న నారా లోకేష్ వైసిపి ల్యాండ్ , శాండ్, వైన్ మాఫియాను అసెంబ్లీ సాక్షిగా ఎండగడతామని ఆయన పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+