
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న చిన్నారి.. మీ విరాళాలే కాపాడుతాయి..!!
బిడ్డ భూమిపైకి వచ్చాడన్న ఆనందం ఆ తల్లిదండ్రులకు ఎంతో సేపు నిలవలేదు. నవమాసాలు మోసి జన్మనిచ్చిన ఆ తల్లికి బిడ్డను చూసే ధైర్యం లేకుండా పోయింది. పుట్టినప్పటి నుంచే బిడ్డ పడుతున్న బాధను ఆ తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు. అవును సెల్వి అనే మహిళకు ఓ బాబు ఈ ఏడాది జనవరిలో జన్మించాడు. కొడుకు పుట్టాడన్న సంతోషం కొన్ని రోజులకే ఆవిరైంది. ఆ చిన్నారి ఇప్పుడు ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఆరు నెలల వయసున్న సమయంలోనే ఈ వ్యాధి ఈ చిన్నారికి సోకింది. ఈ బిడ్డకంటే ముందు ధనుష్ అనే మరో కొడుకు కూడా ఇదే తరహా వ్యాధి ఉంది. ప్రస్తుతం ధనుష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. ధనుష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతుండగానే రెండో బిడ్డను కూడా అదే వ్యాధి రావడంతో తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు.

ఇద్దరు చిన్నారులను బాధిస్తున్న వ్యాధి పేరు ట్రీచర్ కోలిన్స్ సిండ్రోమ్. ఈ వ్యాధితో బాధపడేవారు శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతారు. అలాంటిది చిన్నారులైతే వారి ప్రాణాలు దక్కడం కూడా కష్టమే. ఇదే రకమైన వ్యాధి ఇద్దరు పిల్లలకు రావడంతో చికిత్సకు అయ్యే ఖర్చు ఆ తల్లిదండ్రుల వద్ద లేదు. రెక్కాడితేకానీ డొక్కాడని కుటుంబం వారిది. రోజురోజుకు చికిత్సకు అయ్యే ఖర్చు వారి ఆర్థిక స్థాయికి మించి ఉండటంతో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు విరాళాల కోసం దాతల వైపు చూస్తున్నారు.

ఇక చిన్నారుల తండ్రి హరిహరన్ ఓ ఈమెంట్ మేనేజ్‌మెంట్ ఇండస్ట్రీలో పనిచేసేవాడు. లాక్‌డౌన్ కారణంగా హరిహరన్ ఉద్యోగం కూడా పోయింది. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉంది ఆ కుటుంబం. ఓ వైపు ఇద్దరు పిల్లలకు జరగాల్సిన చికిత్స డబ్బులు లేక నిలిచిపోతుందేమో అన్న భయం ఆ తల్లిదండ్రులను వెంటాడుతోంది. ఇక ఇద్దరి చిన్నారుల చికిత్స కోసం నెలకు రూ.10వేల నుంచి రూ.15వేలు వరకు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం వారి వద్ద అంత డబ్బు లేదు. పొదుపు చేసుకున్న డబ్బంతా చిన్నారుల చికిత్స కోసమే ఖర్చు చేశారు. తమ బిడ్డలను విరాళాలతో కాపాడాల్సిందిగా వేడుకుంటున్నారు. సర్జరీతో పాటు ఇతర చికిత్సకు అయ్యే డబ్బులను సమకూర్చాల్సిందిగా వేడుకుంటున్నారు.
మీరు అందించాలనుకునే విరాళాల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి