తీవ్ర అనారోగ్య సమస్యతో బాధపడుతున్న చిన్నారి గ్లాడీ.. మీరు మాత్రమే కాపాడగలరు
ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న 8 నెలల చిన్నారి పేరు గ్లాడీ సారా. పాప బోసినవ్వులను చూసి ఎంతో సంబరపడ్డ ఆ తల్లిదండ్రులకు ఇప్పుడు ఆ ఆనందం దూరమైంది. గ్లాడీ సారా మూడు నెలల క్రితం విపరీతమైన జలుబుతో బాధపడింది. ఆ సమయంలో తిరువల్లూరులోని డాక్టరుకు చూపించగా చిన్నారిని తిరువల్లూర్ జనరల్ హాస్పిటల్‌లో చూపించాలని చెప్పారు. అక్కడ కార్డియాలజీ క్యాంప్ నిర్వహిస్తున్నారని అక్కడ చిన్నారి గ్లాడీని తీసుకెళ్లి వైద్యులకు చూపించాలని సలహా ఇచ్చారు.
వైద్యులు చిన్నారి గ్లాడీని పరిశీలించి తగు పరీక్షలు నిర్వహించి ఆమె ఓ అరుదైన గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోందని నిర్థారించారు. ఇక అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం MIOT హాస్పిటల్‌కు వెళ్లాల్సిందిగా తిరువల్లూరు జనరల్ హాస్పిటల్ వైద్యులు సూచించారు.

అయితే గ్లాడీ కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేదు. తండ్రి ఒక సాధారణ వ్యాన్ డ్రైవర్. ఒక వేళ కరోనా పరిస్థితే రాకపోతే.. తాను తన కూతురును ఎలాగో అలాగా బతికించుకునేవాడినని.. ప్రస్తుతం పనులు లేక కుటుంబంను పోషించడం కూడా భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
ప్రస్తుతం లాక్‌డౌన్ కారణంగా చాలా కష్టంగా మారిందని సంపాదన కూడా అంతంత మాత్రంగానే ఉందని బాధను వెళ్లగక్కాడు.చిన్నారికి వీఎస్‌డీ మూసుకుపోయాయయని వాటిని సర్జరీ చేసి సరిచేయాలని వైద్యులు తెలిపారు. ఇందుకు రూ.2,80,000 ఖర్చు అవుతుందని చెప్పారు.

ఐసీయూ, హాస్పిటల్, సర్జరీ తర్వాత ఇన్వెస్టిగేషన్, మరియు మెడిసిన్స్‌తో కలిపి ఈ ఖర్చు వస్తుందని అంచనా వేశారు. అంత మొత్తంలో డబ్బులు గ్లాడీ తల్లిదండ్రుల వద్ద లేనందున దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ఎవరైనా సహాయం చేస్తే తమ బిడ్డ తిరిగి ఆనందంగా తమ ఇంటికి చేరుతుందని చెబుతున్నారు. దాతలు సహాయం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.













Click it and Unblock the Notifications