తెలంగాణలో తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే...

తెలంగాణలో కొత్తగా 238 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో ఇద్దరు కరోనాతో మృతి చెందారు. మరో 525 కేసుల రిపోర్టులు ఇంకా రావాల్సి ఉంది. ఈమేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ సోమవారం (జనవరి 4) హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది.

తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,87,740కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 1551కి చేరింది. ప్రస్తుతం 5106 యాక్టివ్ కేసులు కొనసాగుతున్నాయి. 2942 మంది పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.గడిచిన 24 గంటల్లో 518 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,81,081కి చేరింది.

 238 new coronavirus cases and 3 deaths reported from telangana

గడిచిన 24గంటల్లో మొత్తం 27,077 శాంపిల్స్‌ను పరీక్షించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకూ నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 70,18,564కి చేరింది. ఒక మిలియన్ జనాభాకు సగటున 1,88,569 కరోనా టెస్టులు చేస్తున్నట్లు బులెటిన్‌లో వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో మరణాల రేటు 1.4శాతం ఉండగా... తెలంగాణలో 0.53శాతం ఉన్నట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 96.2 శాతం ఉండగా తెలంగాణలో 97.68శాతం ఉన్నట్లు తెలిపారు. తాజాగా అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 60,రంగారెడ్డిలో 26,మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 15 కేసులు నమోదయ్యాయి.

ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,504 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 214 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకూ నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.3కోట్లకు చేరగా... మృతుల సంఖ్య 1,49,649కు చేరింది. దేశంలో కరోనా ఎమర్జెన్సీ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. భారత్ బయోటెక్ కోవ్యాగ్జిన్,సీరమ్ ఇన్‌స్టిట్యూట్ కోవీషీల్డ్‌ వ్యాక్సిన్లకు డీసీజీఐ అత్యవసర వినియోగానికి అనుమతినిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+