తెలంగాణలో 482 కరోనా కేసులు: ఇద్దరు మృతి
కరోనా కేసులు తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా హెచ్చు తగ్గులు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 88,164 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 482 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజా కేసులతో కలిపి మొత్తం 6,50,835 మంది వైరస్ బారిన పడ్డారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3833కి చేరింది. ఒక్కరోజులో 455 మంది కోలుకున్నారు. కోలుకున్న వారి సంఖ్య 6,38,865 మందికి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8137 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం విధాన నిర్ణయం అయితే ప్రకటించలేదు. డిసిషన్ తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications