Viral Video: పంజాగుట్టలో కారు బీభత్సం.. వైరల్ అయిన వీడియో..

హైదరాబాద్ పంజాగుట్టలో ఓ వ్యక్తి మద్యం సేవించి కారు నడుపుతూ బీభత్సం సృష్టించాడు. అడ్డు వచ్చిన వారిని ఢీకొంటూ వెళ్లిపోతున్న వ్యక్తిని స్థానికులు అడ్డుకున్నారు. అతడికి దేహశుద్ధి చేశారు. వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. శుక్రవారం రాత్రి సమయంలో
ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా వాహనాన్ని పాదచారులపైకి దూసుకెళ్లింది. తన కారు బానెట్‌పై యువకుడిని ఈడ్చుకెళ్లాడు. స్మార్ట్ బజార్‌కి ఎదురుగా ఉన్న పంజాగుట్ట జంక్షన్‌లో ట్రాఫిక్‌లో కొన్ని మీటర్ల వరకు తన కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లాడు.

కారును ఆపడానికి అక్కడున్నవారు ప్రయత్నించారు. అయినప్పటికీ ఆపకుండా వెళ్లిపోయాడు.ఎట్టకేలకు డ్రైవర్‌ను ప్రజలు అడ్డుకుని చితకబాదారు. అనంతరం కేసు నమోదు చేసిన పోలీసులకు అప్పగించారు. నిందితుడు కూడా తప్పించుకునే ప్రయత్నంలో గాయపడ్డాడు. పంజాగుట్ట ఎస్‌హెచ్‌ఓ ఈ సంఘటనను సుమోటోగా స్వీకరించి, మానవ ప్రాణాలకు హాని కలిగించేలా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, నంబర్ ప్లేట్ తారుమారు చేసినందుకు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

A car created havoc in Hyderabads Panjagutta

నిందితుడిని ఆస్పత్రిలో చేర్చినట్లు పోలీసులు తప్పించుకునే ప్రయత్నంలో గాయపడినట్లు పేర్కొన్నారు. నిందితుడు గతేడాది అక్టోబర్ 25న జూమ్ యాప్ ద్వారా తాను నడుపుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. తిరిగి ఇవ్వకపోవడంతో యాజమాన్యం ఫిర్యాదు చేయగా, పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. జనవరి 26న, వాహన యజమాని తన కారును జంక్షన్‌లో గుర్తించి వెంబడించడం ప్రారంభించాడు. నిందితుడు తప్పించుకోవడానికి నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల క్రితం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద హిట్ అండ్ రన్ కేసు నమోదు అయింది. ఓ కారు బైక్ ను బలంగా ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఈ కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+