Heart Attack: గుండెపోటుతో గాంధీ ఆస్పత్రి వైద్యుడి మృతి.. పెళ్లైన ఐదు నెలలకే..!

ఈ మధ్య గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. ముఖ్యంగా కరోనా తర్వాత వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తుంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఓ పోలీస్ కానిస్టేబుల్ జిమ్ చేస్తు కుప్పకూలిపోయాడు. అతన్ని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఓ వ్యక్తి బ్యాట్మెంటన్ ఆడుతూ కుప్పకూలి చనిపోయాడు. అంతకు ముందు ఓ వ్యక్తి పెళ్లి హల్దీ ఫంక్షన్ లో కూర్చున్న చోట కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ వ్యక్తి తన మేనకోడలు పెళ్లి సందర్భంగా వేదికపై డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, ఇతరలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు. కాసేపు డ్యాన్ చేసిన తర్వాత కూర్చున్నాడు, కూర్చున్న కాసేపటికే కింద పడిపోయాడు. వెంటనే అక్కడున్నవారు అతన వద్దకు వచ్చినట్లు వీడియోల కనిపిస్తోంది. ఆతన్ని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు.

 death

గుండెపోటకు సాధారణ ప్రజలే కాదు వైద్యులు కూడా బలవుతున్నారు. తాజాగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని పీడియాట్రిక్స్​ విభాగంలో పనిచేస్తున్న డా. ఫణీంద్ర గుండెపోటుతో కన్నుమూశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన ఫణీంద్ర గత కొంత కాలంగా గాంధీ ఆస్పత్రిలో పీడియాట్రిషన్ గా పని చేస్తున్నారు. ఫణీంద్రకు 5 నెలల కిందట కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేసే గైనకాలజిస్ట్ తో వివాహం జరిగింది. ఇద్దరు వేర్వేలు చోట్ల పని చేస్తుండడంతో వారాంతంలో కలుసుకునే వారు.

ఎప్పటిలాగే ఈ వారం పద్మారావునగర్ లోని ఇంటర్నేషనల్ హోటల్లో డాక్టర్ దంపతులు బస చేశారు. సోమవారం తెల్లవారుజామున భార్యను తిరిగి కామారెడ్డికి పంపించేందుకు సిద్ధమవుతుండగా.. ఫణీంద్రకు గుండెపోటు వచ్చింది. ఆయన్ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించగా.. మార్గమధ్యలో చనిపోయినట్లు తెలిసింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. హుజూరాబాద్ లో సోమవారం సాయంత్రం ఫణీంద్ర అంత్యక్రియలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+