crime news: ఆమెకు ఇల్లు అద్దెకిచ్చాడు..ఆ పై సంబంధం..హత్య..ఇదో క్రైమ్ కథా చిత్రం
ఈ మధ్య కొంత మంది కృరంగా మారిపోతున్నారు. హత్యలు చేయడమే కాదు.. మృతదేహాన్ని ముక్కులు కూడా చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రియురాలు శ్రద్దాను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా చేసి అక్కడక్కడ పడేశాడు. చివరికు పోలీసులకు చిక్కి జైలు పాలు అయ్యాడు. అప్పట్లో ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రెండు నెలల క్రితం ముంబైలోని లాల్ బాగ్ ప్రాంతంలో తల్లికూతురు నివాసం ఉండేవారు.
21 ఏళ్ల కూతురు రింపుల్ జైన్.. కన్నతల్లిని హత్య చేసింది. మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టింది. తల, మొండెం బీరువాలో.. కాళ్లు, చేతులు స్టీల్ వాటర్ క్యాన్ లో దాచింది. అలా రెండున్నర నెలలపాటు శవాన్ని ఇంట్లోనే పెట్టింది. దుర్వాసన రాకుండా ఉండేందుకు ఆమె అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంది. ఇందుకోసం 200 రకాల పర్ ఫ్యూమ్స్ వాడింది. మార్చి 14న తన సోదరి కనిపించడం లేదని ఫిర్యాదు రావడంతో అసలు విషయం బయట పడింది.

తాజాగా హైదరాబాద్ సిటీలో వారం రోజుల క్రితం హత్య జరిగింది. మూసీ నదిలో తల దొరికడంతో ఈ విషయం బయటకు వచ్చింది. హత్యకు గురైన మహిళను ఎర్రం అనురాధగా పోలీసులు గుర్తించారు. ఆమె ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తున్నారని విచారణలో తేలింది. ఆమెను చంద్రమోహన్ హత్య చేసినట్లు నిర్ధారించారు.పదేళ్ల క్రితం చంద్రమోహన్ తండ్రికి అనురాధ పనిచేసే ఆస్పత్రిలో ఆపరేషన్ జరిగింది. ఈ క్రమంలో చంద్రమోహన్ కు అనురాధకు పరిచయం ఏర్పడింది.
దీంతో చంద్రమోహన్ చైతన్యపూరిలోని తన ఇంట్లో గ్రౌండ్ ఫ్లోరులో అనురాధకు ఇల్లు అద్దెకు ఇచ్చాడు. ఆమె 2 సంవత్సరాలుగా అక్కడే నివాసం ఉంటోంది. ఈ క్రమంలో చంద్రమోహన్ అనురాధ వద్ద పలు విడతల్లో రూ.7 లక్షల వరకు అప్పు తీసుకున్నాడు. చంద్రమోహన్ ఆన్ లైన్ ట్రేడింగ్ లో డబ్బులు పోగొట్టుకున్నాడు. అదే సమయంలో అనురాధ నుంచి డబ్బులివ్వాలని ఒత్తిడి పెరిగింది. దీంతో ఆమెను హత్య చేయాలని చంద్రమోహన్ నిర్ణయించుకున్నాడు. మే 12 మధ్యాహ్నం అనురాధను హత్య చేశాడు.
తర్వాత మృత దేహాన్ని కత్తి, టైల్స్ కట్టర్‌తో ముక్కలుగా చేశాడు. శరీరం నుంచి తలను వేరు చేసి ఆటోలో తీసుకొచ్చి మలక్‌పేట మూసీ పరివాహక ప్రాంతంలో పడేశాడు. కొన్ని శరీరం భాగాలను బకెట్‌లో, కాళ్లను ఫ్రిజ్‌లో దాచాడు. శరీర భాగాలను ఎలా మాయం చేయాలో యూట్యూబ్ లో చూశాడు. అనురాధ చనిపోయిన విషయం ఎవరికి తెలియకుండా ఉండాలని ఆమె ఫోన్‌ను కూడా ఉపయోగించాడని పోలీసులు తెలిపారు.
-
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
శ్రీకృష్ణుడి అవతారమంటూ కామక్రీడలు: భక్తి ముసుగులో బలత్కారం! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
బెట్టింగ్ యాప్‌లకు బిగ్ షాక్… 300 ప్లాట్‌ఫామ్‌లు బ్లాక్ చేసిన ప్రభుత్వం -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం












Click it and Unblock the Notifications