విషాదం: అనుమానాస్పద స్థితిలో ఐదు నెలల గర్భిణీ ఆత్మహత్య

హైదరాబాద్: నగర పరిధిలోని జగద్గిరిగుట్టలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనుమానాస్పద రీతిలో ఓ గర్భిణీ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబసబ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన లీల దంపతుల కుమార్తె కృష్ణప్రియ(24) ప్రైవేటు ఉద్యోగం చేస్తుండేది. జగద్గిరిగుట్ట పాపిరెడ్డినగర్‌కు శ్రవణ్ కుమార్‌ను ప్రేమించింది. ఇతడు జిమ్ నిర్వహిస్తున్నాడు. ఇక వీరిద్దరూ కూడా దూరపు బంధువులు కావడంతో వారికి ప్రేమకు అడ్డు ఉండదనుకున్నారు.

 A pregnant woman allegedly committed suide in Hyderaad

అయితే, నాలుగేళ్ల క్రితం మరో వ్యక్తితో కృష్ణప్రియకు వివాహమైంది. ఆ తర్వాత అతనితో విడాకులు తీసుకుంది. అనంతరం కృష్ణప్రియ, శ్రవణ్ కుమార్ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆమె ఐదు నెలల గర్భవతి. అయితే, ఏమైందో ఏమో గానీ, బుధవారం రాత్రి కృష్ణప్రియ ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. శ్రవణ్ కుమార్, అతని కుటుంబసభ్యులు అదనపు కట్నం కోసం తమ కుమార్తెను వేధించడంతోనే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి లీల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పిడుగుపాటుకు ముగ్గురు చిన్నారులు మృతి


వేర్వేరు ప్రాంతాల్లో పిడుగుపడి ముగ్గురు మరణించారు. వీరిలో ఇద్దరు చిన్నారులున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం క్యాతన్‌పల్లి గ్రామానికి చెందిన చంద్రమ్మ చిన్నకుమారుడు అరుణ్ కుమార్(15) పదో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం పొలానికి కూలిగా వెళ్లిన అరుణ్.. వర్షం రావడంతో చెట్టు కిందికి చేరాడు. అప్పుడే అక్కడ పిడుగుపడటంతో అరుణ్ మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలు గాయాలయ్యాయి.

మరో ఘటనలో నల్గొండ జిల్లా దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన జూలూరు చెన్నయ్య పెద్ద కుమారుడు ప్రవీణ్(17) 10వ తరగతి పూర్తి చేశాడు. చేనులో పత్తి ఏరుతుండగా పిడుగుపడి అతడు మృతి చెందాడు. ఇంకో ఘటనలో 24ఏళ్ల యువతి పిడుగుపడి ప్రాణాలు కోల్పోయింది. నేరెడుగొమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాధమ్మ కుమార్తె భాగ్యమ్మ(24)తో కలిసి పత్తి ఏరివేతకు వెళ్లింది. సాయంత్రం పిడుగుపడి భాగ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. భాగ్యమ్మకు నవంబర్ నెలలో పెళ్లి నిశ్చయం కాగా, ఈ విషాదం జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+