Hyderabad: ఏమైంది ఈ మనుషులకు.. కూర్చున్న చోటే కుప్పకూలిపోతున్నారు.. వైరల్ అయిన వీడియో..
హల్దీ ఫంక్షన్ లో ఓ వ్యక్తి కూర్చున్న చోటే కింద పడిపోయి చనిపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మనిషికి ఏ క్షణం ఏమవుతుందో తెలియడం లేదు. అప్పకటి వరకు మనతో మాట్లాడిన వ్యక్తే సడన్ గా చనిపోతున్నాడు. హైదరాబాద్‌లో కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ'హల్దీ' వేడుకలో పాల్గొన్న ఓ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందడం అందర్నీ కలవపాటుకు గురి చేసింది. ఫిబ్రవరి 20న నగరంలోని కాలా పత్తర్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వరుడి పాదాలపై పసుపు
40 ఏళ్ల మహ్మద్ రబ్బానీ నగల దుకాణంలో పని చేస్తున్నాడు. అతను 'హల్దీ' వేడుకలో వరుడి పాదాలపై పసుపును పూయడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఒక్కసారికి కుప్పకూలిపోయాడు. వెంటనే స్పందించిన అక్కడున్న వారు అతడిని పైకి లేపారు. ఆస్పత్రికి తరలించగా.. మరోసటి రోజు చికిత్స పొందుతూ మృతి చెందాడు. తాజాగా హైదరాబాద్ బోయిన్ పల్లిలో 24 ఏళ్ల విశాల్ అనే కానిస్టేబుల్ జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు.

కానిస్టేబుల్
ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న అతను శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ లోని ఓ జిమ్ కు వెళ్లి ఎక్సర్ సైజ్ చేస్తూ ఒక్కసారిగా కిందపడిపోయాడు. గమనించిన జిమ్ సిబ్బంది.. అతన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అతి చిన్న వయస్సులోనే అతనికి గుండె పోటు రావడం భయాందోళన కలిగిస్తోంది. ఈ మధ్య ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి.

పునీత్, తారకరత్న
నటుడు పునీత్ నుంచి తారకరత్న దాకా గుండెపోటుతో హార్ట్ ఎటాక్ తో చిన్న వయస్సులో కన్ను మూశారు. హైదరాబాద్ కు చెందిన 30 ఏళ్ల యువకుడు ప్రైవేటు సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి సిగరెట్, మద్యం అలవాటు ఉంది. ఇటీవల డ్యూటీకి బయలుదేరుతూ ఛాతీలో నొప్పి అనడంతో కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లే సరికే అతను ప్రాణాలు విడిచాడు.
కారణాలు
చిన్న వయస్సులోనే గుండె పోటు రావడానికి వైద్యులు పలు కారణాలు చెబుతున్నారు. చదువులో, విధుల్లో తీవ్రమైన ఒత్తిడికి (స్ట్రెస్) గురవడం. స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకోవడం. ఫాస్ట్‌ఫుడ్, రక్తంలో చెడు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉండటం. రెండు పదుల వయస్సులోనే మధుమేహం వ్యాధి వచ్చినా గుర్తించక పోవడం కారణాలుగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications