Hyderabad Viral Video: స్కూటీతో ప్రమాదకర విన్యాసాలు.. వైరల్ అయిన వీడియో..

ఈ మధ్య కొంత మంది యువత సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కోసమో.. లేకుంటే స్నేహితులతో ఛాలెంజ్ చేసో ప్రమాదంలో పడుతున్నారు. ముఖ్యంగా బైక్ స్టంట్లు చూస్తూ ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా కూడా కొంత మంది మారడం లేదు. స్కూటీ, బైక్ పై ప్రమాదకరంగా ప్రయాణం చేస్తున్నారు. స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా రాజేంద్రనగర్ పీవీ నరసింహరావు ఎక్స్ ప్రెస్ ఫ్లైఓవర్ కింద ఓ యువకుడు స్కూటీతో స్టంట్స్ వేశాడు. స్కూటీతో ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు. అతను అలా చేస్తుంటే.. అతని స్నేహితులు దాన్ని వీడియో తెస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. లోకేషన్ కూడా మెన్షన్ చేసింది. రాజేంద్రనగర్ డైరీ ఫామ్ రోడ్డు లో ఈ స్కూటీ విన్యాసం జరిగినట్లు పేర్కొన్నారు. సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ పోలీసులకు ట్యాగ్ చేస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వీడియోపై మంది నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

A video of a young man doing stunts with a scooter is going viral on social media

నగరంలోని రోడ్లపై ఇలాంటి నిర్లక్ష్యపు ప్రవర్తనను అరికట్టేందుకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని పలువురు వినియోగదారులు స్థానిక అధికారులకు ట్యాగ్ చేశారు. ఈ వీడియోకు సంబంధించి పోలీసులు అధికారులు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. నిందితులను గుర్తించి చర్య తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పాతబస్తీ పరిధిలో ప్రమాదకర విన్యాసాలు చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారు విన్యాసాలు చేసి బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. తల్లిదండ్రులు కూడా జాగ్రత్త తీసుకోవాలని కోరుతున్నారు. విన్యాసాలు చేస్తున్నంత సేపు సరదాగా అనిపించినా.. ఒక్కరి కింద పడితే ప్రాణాల మీదికి వస్తుందని వారు గ్రహించడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+