Hyderabad: బ్యూటీపార్లర్‍కు వెళ్తే ఉన్న వెంట్రుకలు పోయాయి..

చాలా మంది మహిళలు అందంపై ఎక్కువగా మక్కువ చూపిస్తారు. ఈ క్రమంలో వారు చాలా బ్యూటీ టిప్స్ పాటిస్తారు. కొందరైతే బ్యూటీపార్లర్ కు వెళ్తుంటారు. ఇలానే ఓ మహిళ బ్యూటీపార్లర్ కు వెళ్లి ఉన్న ముఖం కాస్త చెడగొట్టుకుంది. భర్తకు అందంగా కనిపించాలని ఆమె చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. అబిడ్స్ కు చెందిన ఓ వివాహిత తనని మోడల్ గా చూడాలనుకున్న భర్త కోరిక తీర్చాలనుకుంది.

అబిడ్స్ లో ఉన్న ఓ బ్యూటీపార్లర్ కు వెళ్లారు. బ్యూటీపార్లర్ లోకి వెళ్లి కూర్చిలో కుర్చుంది. అక్కడే ఉన్న బ్యూటీషిన్ ఆ మహిళ వెంట్రుకలకు నూనె రాసింది. హెయిర్ ఆయిల్ పెట్టిన కొద్ది క్షణాల్లోనే సదరు మహిళ వెంట్రుకలు రాలిపోవడం ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె వెంట్రుకలు దాదాపు అన్ని రాలిపోయాయి. అప్పటి వరకు ఒత్తుగా ఉన్న ఆమె జుట్టు చాలా పలుచుగా మారాయి. దీంతో మహిళ ఇంటికి వెళ్లింది.

awomanlostherhair1

మహిళను చూసిన భర్త షాకయ్యాడు. ఏం జరిగిందో భార్యను అడిగి తెలుసుకున్నాడు. దీంతో వెంట్రకలు ఊడిపోవడానికి కారణమైన బ్యూటీపార్లర్ పై కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు. వెంటనే అబిడ్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. బ్యూటీపార్లర్ లో ఆయిల్ రాయగానే వెంట్రుకలు ఊడిపోయినట్లు బాధితురాలు చెప్పింది. గతంలో కూడా బ్యూటీపార్లర్ లో ఇలాంటి ఘటనలు జరిగాయి.

కొద్ది రోజుల క్రితం ఓ మహిళ బ్యూటీపార్లర్ లో ఫేస్ వ్యాక్స్ చేయించుకోగానే ఆమె ముఖం మొత్తం దద్దుళ్లు వచ్చాయి. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. చాలా మంది సరైన అవగాహన లేకుండా బ్యూటీపార్లర్లు పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+