రామ్ చరణ్-ఉపాసన కుమార్తెకు అల్లు అర్జున్ అరుదైన..

రామ్ చరణ్-ఉపాసన కుమార్తె క్లీంకార కొణిదెల రాకతో మెగా కుటుంబంలో సంతోషాలు అంబరాన్నంటాయి. వీరిద్దరికీ వివాహమైన 11 సంవత్సరాల తర్వాత బిడ్డకు జన్మనిచ్చారు. దీంతో మెగా కుటుంబంతోపాటు అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. తాజాగా క్లీంకార బారసాల వేడుక జరిగింది. సన్నిహితులు, బంధువులు హాజరయ్యారు.

వేడుకకు వచ్చిన అతిథులు రామ్ చరణ్ ఉపాసన గారాలపట్టి కోసం విలువైన బహుమతులు తెచ్చారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బంగారు కాయిన్స్ ప్రత్యేకంగా డిజైన్ చేయించి పంపించినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అల్లు అర్జున్ తన మేనకోడలకు విలువైన కానుక పంపించినట్లు సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతోంది.

allu arjun gift to ram charan upasana daughter klin kaara

అల్లు అర్జున్ తన కోడలికి బంగారు పలకను బహుమతిగా ఇచ్చారు. పలకేంటి అని ఆశ్చర్యపోకండి. క్లాంకార పేరు, పుట్టిన వివరాలు వచ్చేలా పలకపై బంగారు అక్షరాలతో చెక్కించి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రాగానే మెగా అభిమానులతోపాటు బన్నీ అభిమానులు కూడా ఖుషీ అవుతున్నారు.

ఇటీవలి కాలంలో మెగా, అల్లు కుటుంబాల మధ్య దూరం పెరుగుతోందంటూ ప్రచారం నడుస్తోన్న సంగతి తెలిసింది. దీనిపై అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా పుష్ప2 లో నటిస్తున్నారు. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. అది కూడా పాన్ ఇండియా చిత్రంగానే రూపుదిద్దుకోబోతోంది. మరోవైపు రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నారు. దీని తర్వాత బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+