Telangana Weather: 3 రోజులు వానలు, హైదరాబాద్‌లో భారీ వర్షం.. కూలిన చెట్లు!

దక్షిణ అరేబియా సముద్రంలో నైరుతి దిశగా బలంగా గాలులు వీస్తున్నాయి. వచ్చే 24 గంటలలో నైరుతి ఋతుపవనాలు కేరళలో ప్రవేశించే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌ఘడ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కి మి వద్ద ఏర్పడింది. గాలి విచ్చిన్నతి తెలంగాణ రాష్ట్రంపై సముద్ర మట్టానికి 1.5 కి మి వరకు ఉంది.

వచ్చే 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ, రేపు చాలా చోట్ల, ఎల్లుండి కొన్ని చోట్ల వర్షం కురవనుంది. 3 రోజులు ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం కురవనుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఒకటి, రెండు చోట్ల భారీ వర్షం.. కొన్ని జిల్లాలలో మోస్తరు వర్షం కురవనుంది. వాతావరణ శాఖ వివరాలు తెలియజేసిందో లేదో భాగ్యనగరంలో భారీ వర్షం కురిసింది.

another 3 days rain in telangana state

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం పడింది. ఫిలింనగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, యూసుఫ్‌గూడ, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, బీఎన్‌రెడ్డినగర్‌, గచ్చిబౌలి, గోల్కొండ, మెహిదీపట్నం, మాసబ్‌ట్యాంక్‌లో భారీ వర్షం కురిసింది.

వర్షానికి పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. దీంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. రోడ్లన్నీ వర్షానికి జలమయయ్యాయి. లాక్‌డౌన్ వల్ల ఎవరూ బయటకు రాలేదు. దీంతో ట్రాఫిక్ సమస్య ఎదురుకాలేదు. లేదంటే గతంలో మాదిరిగా ఇబ్బంది పడాల్సి వచ్చేది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+